Kangana Ranaut: కానిస్టేబుల్ చేతిలో దెబ్బలు తిన్న కంగనా రనౌత్ !

Kangana Ranaut : వివాదాస్పద నటి, పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లోకి రాకముందు… సినిమాల్లోనే రాణిస్తూ… నిత్యం వివాదాలకు తెరలేపుతూ ఉండేది కంగనా రనౌత్. అయితే ఈ బ్యూటీ… ఇటీవల రాజకీయాలలోకి వచ్చి బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసింది. అంతేకాదు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా గెలిచి సత్తా చాటింది. అయితే ఎంపీగా గెలిచి నాలుగు రోజులు కూడా కాలేదు… అంతలోనే మరో వివాదంలో చిక్కుకుంది కంగనా రనౌత్.

Kangana Ranaut slapped by CISF jawan at Chandigarh airport: Reports | Today News
చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ… వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. చండీగఢ్ ఎయిర్పోర్టుకు చేరుకున్నప్పుడు తనపై దాడి జరిగినట్లు… ఫిర్యాదు చేసింది ఈ బ్యూటీ. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నానని… ఆ సమయంలో కానిస్టేబుల్ తనపై దాడి చేసినట్లు కంగనా ఆరోపణలు చేసింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న సెక్యూరిటీ చెక్ ఇన్ తర్వాత… బోర్డింగ్ కోసం వెళ్తున్నప్పుడు కుల్విందర్ కౌర్ అనే కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ తెలిపింది.

రైతుల ఉద్యమాన్ని అవమానించారని… దూషిస్తూ తనపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది కంగనా. ఆ తర్వాత కంగనాతో కలిసి ప్రయాణిస్తున్న మయాంకుమధూర్… కుల్విందర్ ను చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా కంగనా పై దాడి చేసినందుకు మహిళా కానిస్టేబుల్ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు