MS.Narayana: ఎమ్మెస్ చివరి గంటలో కోరిన కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మి..!

MS.Narayana.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెజెండ్రీ హాస్య నటులలో ఒకరైన ఎమ్మెస్ నారాయణ గురించి.. ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. కామెడీతో నవ్వించడమే కాదు ఎమోషనల్ గా ఏడిపించగలరు కూడా.. అందుకే ఇప్పటికీ ఆయన మన మధ్య లేకపోయినా ఆయనను అభిమానులు స్మరిస్తూనే ఉంటారు.. ముఖ్యంగా తాగుబోతు పాత్రలతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా దూకుడు , దుబాయ్ శీను చిత్రంలో ఫైర్ స్టార్ సల్మాన్ రాజుగా ఎమ్మెస్ నారాయణ కామెడీ లో విశ్వరూపం ప్రదర్శించారని చెప్పవచ్చు. ఇకపోతే ఎమ్మెస్ నారాయణ , బ్రహ్మానందం మధ్య చెరగని స్నేహం ఉంది.. ఎన్నో చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు కూడా.. ఇక ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్ నారాయణకు సంబంధించిన ఒక విషయాన్ని తలచుకొని బ్రహ్మానందం కన్నీటి పర్యంతమయ్యారు.

ఎమ్మెస్ నారాయణ ఆ కోరిక కోరారు..

MS.Narayana: That's the wish that Mme asked in the last hour.. Brahmi who was in tears..!
MS.Narayana: That’s the wish that Mme asked in the last hour.. Brahmi who was in tears..!

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ చివరి దశలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అసలు విషయంలోకి వెళితే అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.. ఎమ్మెస్ నారాయణ అయితే అప్పుడే ఆయన పరిస్థితి విషమించింది.. మరో గంటలో మరణిస్తారు.. అనగా ఎమ్మెస్ నారాయణ తన కుమార్తెను పిలిచి పేపర్ అడిగారట.. ఆ పేపర్ పై “బ్రహ్మానందం అన్నను చూడాలని ఉంది” అని రాశారట. దీంతో వెంటనే ఆయన కూతురు బ్రహ్మానందం కి ఫోన్ చేయగా.. అప్పుడు బ్రహ్మానందం “ఆరడుగుల బుల్లెట్” చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు.

చివరి క్షణంలో అంటూ కన్నీటి పర్యంతమైన బ్రహ్మి..

ఇక ఎమ్మెస్ నారాయణ కూతురు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో వెంటనే బ్రహ్మానందం ఆ సినిమా డైరెక్టర్ కి అసలు విషయం చెప్పి ఆసుపత్రికి వెళ్లారట.. బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణను అలా బెడ్ పై చూసి వెంటనే ఆయన చేయి పట్టుకున్నారట.. ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.. కొంత అర్థం అవుతుంది.. కొంత అర్థం కావడం లేదు.. నా చేతిని గట్టిగా పట్టుకొని అన్నయ్య అంటున్నాడు.. ఇక ఎమ్మెస్ బాధను చూసి భరించలేకపోయి..పక్కకు వచ్చేసి నాలోని దుఃఖాన్ని కన్నీళ్ళ రూపంలో బయట పెట్టుకున్నాను.. పక్కకు వచ్చిన 15 నిమిషాల్లోనే ఎమ్మెస్ నారాయణ ప్రాణం పోయింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు బ్రహ్మానందం..

- Advertisement -

ఎంఎస్ నారాయణ నాకు ముఖ్యమైన వ్యక్తి..

ఎమ్మెస్ నారాయణ గురించి మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ ఒక కమెడియన్ మాత్రమే కాదు.. నాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా.. చాలా సింపుల్ గా జోకులు వేస్తూ ఉంటాడు. నార్మల్ గా మాట్లాడినట్లే ఉంటుంది కానీ అందులో పంచ్ ఉంటుంది.. నాకు ఇష్టమైన కమెడియన్ కూడా ఎమ్మెస్ నారాయణ.. నాకు ప్రాణ మిత్రుడు కూడా అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు.. ముఖ్యంగా ఎల్బీ శ్రీరామ్ , కృష్ణ భగవాన్ లాంటి వారి పైన ఎమ్మెస్ నారాయణ వేసే పంచ్ లకు నేను కడుపుబ్బా నవ్వే వాడిని అంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు బ్రహ్మానందం.. ఏది ఏమైనా ఎమ్మెస్ నారాయణ లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ ఇండస్ట్రీలో తారసపడరు అని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు