Brahmaji.. సింధూరం వంటి సినిమాలతో ఒకప్పుడు హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్న బ్రహ్మాజీ.. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమయ్యాడు. ఇప్పుడు తాజాగా పుష్ప 2 లో తాను నటిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చేశారు. అసలు విషయంలోకెళితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 70,000 భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు కూటమిలో భాగంగా 21 స్థానాలలో పోటీ పడగా 21 స్థానాలలో కూడా విజయం సాధించి అఖండ విజయాన్ని కైవసం చేసుకుంది జనసేన పార్టీ.. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా హోం శాఖను ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపించడమే కాదు పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు ప్రశంసల వెల్లువ..
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్, రామ్ చరణ్ , నితిన్, వరుణ్ తేజ్, సాయి ధరంతేజ్ , డైరెక్టర్ హరీష్ శంకర్ , నిర్మాత నాగవంశీ తో సహా పలువురు స్టార్స్ అందరూ పవన్ కళ్యాణ్ కి విషెస్ చెబుతూ ఉండగా.. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కూడా పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెబుతూ ఒక ట్వీట్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా పవన్ అభిమానులు షేర్ చేసే ట్రోల్స్, వీడియోలకి కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు బ్రహ్మాజీ.
పుష్ప -2 లో బ్రహ్మాజీ..
తాజాగా బ్రహ్మజీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇలా రాసుకొచ్చారు.. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను.. మీరు కూడా మీ పని చూసుకుంటే చాలా మంచిది.. ఇక ఉత్సాహం , వినోదం రెండూ అయిపోయాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ సేఫ్ హాండ్స్ లో ఉంది ..మీరు కూడా మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి.. ట్రోలింగ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.. మన భవిష్యత్తు కోసం మనమే పనిచేద్దాం.. వాళ్ళు తప్పు చేస్తే మళ్లీ మీరు అదే తప్పు చేయకూడదు కదా.. అంటూ ట్వీట్ చేశారు బ్రహ్మాజీ.. ఇక బ్రహ్మాజీ చేసిన ఈ పోస్ట్ కి మద్దతు తెలుపుతున్నారు.. కానీ కొంతమంది మాత్రం బ్రహ్మాజీ పై ఫైర్ అవుతున్నారని చెప్పాలి.. వైసీపీని పరోక్షంగా నిందించాడు బ్రహ్మాజీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈ విషయంపై వైసీపీ అభిమానులు ఏ విధంగా కామెంట్లు చేస్తారో చూడాలి..
మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు..
మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులైన వ్యక్తులలో బ్రహ్మజీ కూడా ఒకరు.. ఇప్పటివరకు మెగా హీరోలందరి సినిమాలలో కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించారు.. వారి సినిమాలలోనే కాకుండా బయట కూడా మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు.. ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు బ్రహ్మాజీ.. ఇక మొత్తానికైతే బ్రహ్మాజీ జనసేన శ్రేణులకు తనదైన శైలిలో కామెంట్ చేస్తూనే.. తాను పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు.. మొత్తానికైతే పుష్ప2లో బ్రహ్మాజీ భాగం కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Busy shooting #puspha .. pl get back to work.. excitement n entertainment over.. AP is in safe hands.concentrate on your future.. no point of trolling .. let’s us work for ourselves for better future.. vaallu thappu chesthe ..Malli Meru ade thappu cheyyakoodadu kada .. 🙏🏼 ..
— Brahmaji (@actorbrahmaji) June 6, 2024