Viswam : పదేళ్లగా హిట్ లేదు.. అయినా గోపీచంద్ మూవీకి హిందీ డబ్బింగ్ లో సాలిడ్ రేటు..

Viswam : టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపిచంద్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ లో చెక్కు చెదరని క్రేజ్ ఉన్న హీరోల్లో గోపీచంద్ కూడా ఒకరు. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. కానీ సరైన స్క్రిప్ట్ ఉన్న సినిమాలు సెలెక్ట్ చేసుకోక వరుస ప్లాప్ లు అందుకున్నాడు. కానీ తన సినిమాల్లో తన వంతు న్యాయం మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఇక గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే ఆల్ మోస్ట్ 10 ఏళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చిన లౌక్యంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్, ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క హిట్ మూవీ కూడా తన ఖాతాలో పడలేదు. రెండేళ్ల కింద వచ్చిన సీటిమార్ కాస్త పర్వాలేదనిపించగా, రీసెంట్ మూవీ ‘భీమా’ బిలో యావరేజ్ అనిపించింది. కానీ భీమా మూవీ తో గోపిచంద్ ఒక మాస్ మూవీ చేస్తే బిసి సెంటర్లలో ఏ రేంజ్ లో అభిమానులు ఆదరిస్తారో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అందుకే నిఖార్సైన హిట్టు కోసం మరింత కష్టపడుతున్నాడు.

Solid offer for Gopichand's Viswam movie in Hindi dubbing rights

శ్రీనువైట్లతో విశ్వం..

ఇక గోపీచంద్ ప్రస్తుతం వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న శ్రీను వైట్ల డైరెక్షన్ లో సినిమా చేస్తూ ఉండగా, ఆ సినిమా కి విశ్వం (Viswam) అనే టైటిల్ ను కన్ఫాం చేశారు. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన టైటిల్ కం ఫస్ట్ లుక్ టీజర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఇంకా రిలీజ్ ఎప్పుడో కూడా కన్ఫాం అవ్వని ఈ సినిమా బిజినెస్ పరంగా మాత్రం ఇప్పటి నుండే జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా గోపీచంద్ మూవీస్ కి నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ సాలిడ్ గానే జరుగుతూ ఉండగా ఇప్పుడు విశ్వం మూవీకి నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆఫర్స్ కూడా భారీగా వస్తున్నాయని సమాచారం.

- Advertisement -

విశ్వం హిందీ డబ్బింగ్ కి సాలిడ్ రేటు..

ఇక గోపీచంద్ విశ్వం సినిమాకు రీసెంట్ గా హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ సాలిడ్ రేటుకి అమ్ముడు పోయినట్లు టాక్ స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. వచ్చిన సమాచారం ప్రకారం, విశ్వం సినిమాకి హిందీ డబ్బింగ్ రైట్స్ కిందా 10 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయ్యిందట. ఇక గోపీచంద్ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా విశ్వం సినిమాకి ఇలాంటి రేటు సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయి పోగా, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక గోపీచంద్ తో పాటు శ్రీను వైట్ల కూడా చాలా కాలంగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉండగా, వీళ్ళ కాంబోలో వస్తున్న ఈ సినిమాతో ఇద్దరూ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు