Nandamuri Chaitanya Krishna About NTR: మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కు ఎన్టీఆర్ రాడు, చైతన్య కృష్ణ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

Nandamuri Chaitanya Krishna About NTR: ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాడు. నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వివి వినాయక దర్శకత్వంలో చేసిన ఆది సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా తో స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. చాలా చిన్న ఏజ్ లోని ఎన్నో రికార్డులను సృష్టించాడు.

నందమూరి ఫ్యామిలీ లో ప్రత్యేకం

నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్టీఆర్ కి చాలామంది వారసులు ఉన్నా కూడా, వారిలో కొద్దిమంది మాత్రమే ఆ ఫ్యామిలీకి మంచి గుర్తింపును తీసుకొచ్చారు. మిగతావాళ్లు కొన్ని సినిమాలు చేసినా కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయాయి. మా ఫ్యామిలీ అంతట్లో కూడా ఎన్టీఆర్ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని కెరియర్ లో ముందుకు వెళ్లాడు. ఒక టైం లో హరికృష్ణ ఉన్నప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి చాలా కష్టపడుతూ ఎండల్లో కూడా తిరిగాడు. అప్పట్లో ఆ పార్టీలో చాలా కీలకంగా ఉండేవాడు. ప్రస్తుతం పార్టీకు దూరంగా ఉన్నాడు ఎన్టీఆర్. చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో స్పందించిన తీరు చాలామందికి నచ్చలేదు.

Jr NTR

- Advertisement -

వరుస హిట్ సినిమాలు

ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వస్తే ఒకప్పుడు ఒక హిట్ సినిమా డైరెక్టర్ తో వెంటనే సినిమాలు చేసేవాడు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫీల్ అయ్యేవి. కానీ రీసెంట్ టైమ్స్ లో ప్లాప్ డైరెక్టర్ తో పని చేసిన కూడా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. టెంపర్ సినిమా తర్వాత ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సాధించుకున్నాడు. మొత్తానికి నందమూరి వారసుడు అని ఇప్పుడే కాకుండా ఎప్పుడూ అనిపించుకున్నాడు. అయినా కూడా నందమూరి ఫ్యామిలీలో అంతర్గతంగా చాలా జరుగుతున్నాయి అని ఎప్పటినుంచో కథనాలు వినిపిస్తున్నాయి.

నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్ కు అటెండ్ అవ్వడు

ఇకపోతే రీసెంట్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసింది. దీనికి స్పందిస్తూ నందమూరి ఫ్యామిలీలో రాజకీయాల్లో కొనసాగుతున్న వాళ్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపాడు ఎన్టీఆర్. ఇక్కడితో అన్నిటికీ తెరపడింది అని చాలామంది అనుకున్నారు. ఇకపోతే రీసెంట్ గా నందమూరి కృష్ణ చైతన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ హాజరవుతారా అని యాంకర్ ప్రశ్నించగా, నాకు ఆ విషయం తెలీదు మేము చాలా ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేశాము కానీ నందమూరి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఎన్టీఆర్ ఎటెండ్ అవ్వడు. అంటూ సంచలమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే కృష్ణ చైతన్య చాలా సందర్భాల్లో కూడా ఎన్టీఆర్ ని తేలికగా తీసి పడేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు