Hero Good Bye to Movies : సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నిఖిల్… ఇకపై పాలిటిక్స్ మాత్రమే?

Hero Good Bye to Movies : సౌత్ నుంచి నార్త్ దాకా ప్రస్తుతం సినిమా సెలబ్రిటీలు అందరూ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. పైగా ప్రజలు కూడా వారికి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, కంగనా రనౌత్ లాంటి స్టార్స్ తో సహా పలువురు సినీ సెలబ్రిటీలు ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లతో ఘన విజయం సాధించారు. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పూర్తిగా ఎన్నికలపై ఫోకస్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో యంగ్ హీరో నిఖిల్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకే పరిమితం కాబోతున్నారనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి నిఖిల్ ఎందుకు సినిమాలను వదిలేయాలనుకుంటున్నాడు? అంటే…

సినిమాలకు గుడ్ బై చెప్పేశారా?

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న యంగ్ హీరో నిఖిల్ మీరు అనుకుంటున్న టాలీవుడ్ హీరో నిఖిల్ కాదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కన్నడ స్టార్ నిఖిల్ గురించి. నిఖిల్ కుమారస్వామి చాలా ఏళ్లుగా సినీ పరిశ్రమతో పాటు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఆయన రాజకీయాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా ? అనే సందేహం నెలకొంది.

Poll Effect: Nikhil Kumaraswamy Resign As JDS Youth Wing President - Oneindia News

- Advertisement -

క్లారిటీ కాదు కన్ఫ్యూజన్

అయితే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన తన రాజకీయ ఎంట్రీపై, అలాగే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్తలపై క్లారిటీ ఇస్తారు అనుకుంటే మరింత కన్ఫ్యూషన్ లోకి నెట్టేశారు. మాండ్యలో నిఖిల్ కీలక పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఈసారి సినిమా పరిశ్రమ నుంచి తప్పుకోవడంపై పరోక్షంగా మాట్లాడారు. పార్టీని నిర్మించే బాధ్యతను తనకు అప్పగించారు అని తెలుపుతూనే ఇక నుంచి పార్టీ నిర్మాణం పైనే దృష్టి సారిస్తాను అని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ట్రై చేస్తానని అన్నారు. అయితే వీటన్నింటి కంటే ఆయన చెప్పిన మరో డైలాగ్ నేను ఫుల్ టైం పొలిటీషియన్ ని అని అనౌన్స్ చేయడం కొత్త అనుమానాలకు తెర తీసింది. ఈ అనౌన్స్మెంట్ తో ఆయన సినిమా ఇండస్ట్రీని వదిలేయబోతున్నారా ? అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ వార్తలపై నిఖిల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

నిఖిల్ సినిమాలు

నిఖిల్ కుమారస్వామి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కుమారుడు, భారత మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు. ‘జాగ్వార్‌’ నిఖిల్ కు తొలి సినిమా. ఏఎ సినిమా ద్వారానే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన నిఖిల్ ఆ తరువాత ‘సీతారామ కళ్యాణ’, ‘కురుక్షేత్ర’, ‘రైడర్‌’ చిత్రాల్లో నటించారు. అయితే జాగ్వార్ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు ఈ మూవీని అంతగా పట్టించుకోలేదు. ఆ తరువాత నిఖిల్ నటించిన సినిమాలేవీ తెలుగులో రిలీజ్ కాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు