Suresh Gopi: జూన్ అంటేనే నరకం.. 30 ఏళ్లకు పైగా నరకం..!

Suresh Gopi: రాజకీయరంగం , సినీ ఇండస్ట్రీ, బిజినెస్ రంగం ఇలా ఏ రంగంలో అయినా సరే గెలుపు ఓటమి సహజం.. కానీ కొన్ని విజయాలు చరిత్రలో నిలిచిపోతే.. మరికొన్ని విజయాలు ఆ చరిత్రనే తిరగ రాస్తాయి… అలా తన సక్సెస్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రముఖ నటుడు సురేష్ గోపి.. 1952లో లోకసభ ఎన్నికలు మొదలయ్యాయి.. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగగా.. ఒక్కసారి కూడా కేరళలో బిజెపి గెలవలేదు. ఇంతకాలం అసాధ్యం అనుకున్న బిజెపి విజయాన్ని.. ఒక గెలుపుతో సుసాధ్యం చేసి చూపించారు సురేష్ గోపి ఈ సక్సెస్ తో గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో.. కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్త అయినా తగ్గుతుందేమో..

ప్రాణం కాపాడు స్వామి..

Suresh Gopi: Hell is June.. Hell for more than 30 years..!
Suresh Gopi: Hell is June.. Hell for more than 30 years..!

1992 జూన్ 6వ తేదీన భార్య బిడ్డతో ప్రయాణిస్తున్న సురేష్ గోపి కారు ఒక్కసారిగా రోడ్డు ప్రమాదానికి గురైంది.. స్పృహలోకి వచ్చేసరికి ఆసుపత్రి బెడ్ మీద ఆయన ఉన్నాడు ..కళ్ళు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు.. నా ప్రాణం కాపాడు స్వామి అంటూ దేవుడికి మొక్కుకున్నాడు.. ఇక్కడ తన ప్రాణం అంటే ఆయన కూతురు లక్ష్మి. గాయాలు ఇబ్బంది పెడుతున్నా.. శక్తి తెచ్చుకొని ఏడాదిన్నర వయసున్న కూతుర్ని చూసేందుకు ఐసీయూలోకి వెళ్ళాడు.. కొన ప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు కూడా చలించలేదు.. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్ మాసం అంటేనే తనకు భయం.. అయిష్టత…ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం మరింత నొప్పి పెడతాయట.. ఎంత నొప్పి పెట్టిన ఆ నొప్పి భరించడం తనకు ఇష్టమే అంటాడు సురేష్ గోపి.. అదే తన కూతురితో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు కాస్త విసురుతాడు..

32 యేళ్ళుగా నరకం..

ఇప్పుడు నలుగురు పిల్లలున్నా..సరే లక్ష్మీ లేని లోటు ఎవరూ పూడ్చలేరు అంటారు.. విధి ఎంత విచిత్రమో కదా… జూన్ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది సరిగ్గా ఇప్పటికి 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో ఊహించని విజయం ఆయనకు వరించింది.. మరి ఈ విజయమైనా ఆ బాధను పూడుస్తుందా అంటే.. చెప్పలేని పరిస్థితి.. అందుకే జూన్ అంటే భయం.. 32 ఏళ్లుగా నరకం చూస్తున్న అని తెలిపాడు సురేష్ గోపి…

- Advertisement -

సురేష్ గోపి రాజకీయ జీవితం…

ఇదిలా ఉండగా ఈయన రాజకీయ జీవిత విషయానికి వస్తే.. 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయిన సురేష్ గోపి తర్వాత బిజెపిలో చేరారు.. 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసినా విజయం వరించక వెనుతిరిగాడు.. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్ నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఇక బిజెపి అక్కడ రావడం అసాధ్యం అన్న నోటి వెంట సుసాధ్యం చేసి చూపించారు సురేష్ గోపి..

తెలుగులో నటించిన సినిమాలు..

నటుడిగా వందల సినిమాలు చేసిన ఈయన తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు. ఏది ఏమైనా ఇలాంటి విజయాలు చరిత్రను తిరగ రాస్తాయేమో కానీ ఆయన బాధను మాత్రం తీర్చలేవు అని చెప్పడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు