Cheating : స్టార్ హీరో పేరుతో 82 లక్షల మోసం… నిందితుడు అరెస్ట్

Cheating : సినిమా ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో కొంతమంది కేటుగాళ్లు విసిరే వలలో చిక్కుకుంటే బయటపడడం కష్టమే. కాస్త అమాయకంగా కన్పిస్తే చాలు మాయ మాటలు చెప్పి లక్షలు లక్షలు గుంజుతారు. అసలు విషయం తెలుసుకునేలోపే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

స్టార్ హీరో సినిమాకు నిర్మాతను చేస్తానని..

బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ‘లవ్ ఇన్ లండన్’ అనే సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిర్మాతను చేస్తానని మాయ మాటలు చెప్పి ఓ మహిళను రూ.82 లక్షల 75 వేలు మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు కృష్ణ శర్మను అంబోలి పోలీసులు అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే?

నటుడు కార్తీక్ ఆర్యన్ చిత్రంలో ఆమెను నిర్మాతగా చేస్తానని గోరేగావ్ నివాసి ఐశ్వర్య శర్మకు కృష్ణ హామీ ఇచ్చాడు. ఐశ్వర్య బాలీవుడ్ నిర్మాతగా మారాలి అనుకుంటున్నా విషయాన్ని తెలుసుకున్న కృష్ణ కుమార్ పక్కా ప్లాన్ తో ఆమెను కలిశాడు. అతను ఐశ్వర్యను సంప్రదించి, నటుడిని కలిశానని చెప్పాడు. అయితే ఆయనను ఐశ్వర్య స్వయంగా కలవాలి అనుకుంటే కొంత డబ్బు అవసరమని చెప్పిన కృష్ణ.. ఐశ్వర్య నుంచి 82 లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బు చేతికి అందిన తర్వాత సాకులు చెప్పడం మొదలు పెట్టాడు. దీని గురించి అడిగినప్పుడల్లా కార్తిక్ ఆర్యన్ బిజీగా ఉన్నాడు అని చెప్పాడు. మెల్లగా ఐశ్వర్య తాను మోసపోయానని గ్రహించింది. అతని సాకులతో విసిగిపోయిన బాధితురాలు ఆందోళన చెందుతూ జూలై 3న అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.

- Advertisement -

Kartik Aaryan Buys A Beast Priced 87.5% Higher Than Bhushan Kumar's Gift!  10 Most Expensive Things He Owns!నిందితుడు అరెస్ట్

ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది. విచారణ అనంతరం కృష్ణ అతను కర్ణాటకలో ఉన్నాడని తెలుసుకొని, ఇటీవలే అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం అతనిపై ముంబై, ఢిల్లీ, చెన్నైలలో మోసం కేసులు నమోదయ్యాయి. 

సినిమా స్టైల్ లో మోసాలు

ఇదిలా ఉండగా వకోలాలో విదేశీ కరెన్సీ మార్పిడి వ్యాపారిని రూ. 21 లక్షలకు మోసం చేసినందుకు ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ యూనిట్-8 బెంగళూరులోని ఒక హోటల్ నుండి కృష్ణన్ అనే వ్యక్తిని అరెస్టు చేసింది. దీని తర్వాత పోలీసుల విచారణలో కృష్ణన్ వాస్తవానికి కృష్ణ శర్మ అని తేలింది. మహిళను రూ.82.75 లక్షలు మోసం చేసింది ఈ కేటుగాడే అని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మోసానికి వేర్వేరు పేర్లను వాడుకుంటాడు కృష్ణ. అంబోలి ఫ్రాడ్‌లో అతను తన పేరును కృష్ణ శర్మగా మార్చుకున్నాడు. అయితే వకోలా మోసంలో కృష్ణన్‌గా మారాడు. ఇంకా ఇతని వల్ల మోసపోయిన చాలా మంది బాధితులు ముందుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

కార్తీక్ ఆర్యన్ కు తెలుసా?

దీని గురించి కార్తీక్ ఆర్యన్‌కు ఎలాంటి సమాచారం లేదు. ‘చందు ఛాంపియన్‌’ ప్రమోషన్‌లో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూన్ 14న విడుదల కానుంది. దీంతో పాటు ‘భూల్ భూలయ్య 3’లో కూడా పాల్గొంటున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు