Vijay Sethupathi: మల్టీస్టారర్ కు సేతుపతి దూరం… ఆ స్టార్ హీరోనే కారణమా?

Vijay Sethupathi: విజయ్ సేతుపతి టాలెంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ దాకా ఆయన గురించి అందరికీ తెలుసు. అయితే తాజాగా విజయ్ సేతుపతి మల్టీ స్టారర్ సినిమాలపై చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. కామెంట్స్ చేయడమే కాదు మల్టీ స్టారర్ సినిమాలపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు విజయ్ సేతుపతి. ఇంతకీ ఈ స్టార్ హీరో మల్టీస్టారర్ సినిమాల గురించి ఏం చెప్పారు? అనే వివరాల్లోకి వెళ్తే…

మల్టీ స్టారర్ సినిమాలకు ఇకపై దూరం

విజయ్ సేతుపతి హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ మహారాజా జూన్ 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మహారాజా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి మల్టీస్టారర్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంటర్వ్యూలో భాగంగానే సేతుపతి మాట్లాడుతూ తనకు ఇతర స్టార్ హీరోలతో కలిసి పని చేయడం ఇష్టం లేదని, అలాగే విలన్ పాత్రలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని తీసుకుంటున్నానని చెప్పి షాక్ ఇచ్చారు. అలాంటి సినిమాలతో అలసిపోయానని, ఎందుకంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు కొన్ని మంచి, అలాగే మరికొన్ని చెడు అనుభవాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు.

విజయ్ సేతుపతి మాట్లాడుతూ మరొక స్టార్ తో సినిమాకు సైన్ చేసినప్పుడు పాత్ర పరంగా దేనికి సైన్ చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. కానీ కొన్నిసార్లు ఎంత కష్టపడి పని చేసినా, బాగా చేసినా చివరికి పెద్దగా వ్యాల్యూ ఇవ్వరు. ఆ సినిమాకు ఎంతగానో సహకరించినప్పటికీ ఎవ్వరూ దాని గురించి మాట్లాడరు” అంటూ నిరాశను వ్యక్తం చేశారు.

- Advertisement -

Vijay Sethupathi expresses his disappointment on being given 'minimal  value' in multi-starrers; is it due to Jawan? | PINKVILLA

నెగిటివ్ రోల్స్ కి నో

అంతేకాకుండా నెగిటివ్ రోల్స్ చేయడం గురించి కూడా విజయ్ సేతుపతి మాట్లాడారు. ఇలాంటి పాత్రలు చాలా తిరస్కరించానని చెప్పాడు. నెగిటివ్ రోల్స్ చేసినప్పుడు అంతకుముందు చేసిన సినిమాలకు పోలికలు పెడతారు, క్యారెక్టర్ పరంగా పరిమితులు ఉంటాయి అంటూ తను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో వివరించారు.

ఆ స్టార్ హీరో వల్ల సేతుపతి అప్సెట్ ?

విజయ్ సేతుపతి చివరగా నటించిన మల్టీ స్టార్లర్ మూవీ జవాన్. అందులో షారుఖ్ ఖాన్ తో కలిసి విజయ్ సేతుపతి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. తాజాగా ఆయన ఇకపై మల్టీస్టారర్ సినిమాలు, నెగిటివ్ రోల్స్ చేయను అంటూ తీసుకున్న నిర్ణయానికి షారుక్ ఖాన్ కారణం అంటున్నారు. ఎందుకంటే జవాన్ సినిమా 1000 కోట్లు సాధించినప్పటికీ ఈ మూవీలో విజయ్ సేతుపతి పాత్ర, ఆయన గురించి ఎవ్వరూ ఎక్కడా మాట్లాడలేదు. సినిమాలో సేతుపతి విలన్ గా కీ రోల్ పోషించినప్పటికీ మూవీ సక్సెస్ లో ఆయనను భాగం చేయకపోవడంతో విజయ్ సేతుపతి నిరాశ చెందాడని కామెంట్స్ చేస్తున్నారు.

మెగాఫోన్ పట్టనున్న సేతుపతి

నటుడిగా విజయ్ సేతుపతికి మహారాజా 50వ సినిమా కావడం గమనార్హం. భవిష్యత్తులో చిత్రాలకు దర్శకత్వం వహించాలని అనుకుంటున్నానని, ప్రస్తుతం లైటింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ తదితర అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లు సేతుపతి వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు