‘సత్యభామ’ మూవీ రివ్యూ

కాజల్ ఫేడౌట్ దశకి దగ్గర్లో ఉంది. సీనియర్ స్టార్ హీరోలకి తప్ప యంగ్ హీరోలకి ఈమె ఛాయిస్ గా లేదు. ఈ విషయాన్ని గ్రహించి వెంటనే ఓ విమెన్ సెంట్రిక్ మూవీ చేసింది. అదే ‘సత్యభామ’. ఈరోజు అనగా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ : సత్యభామ(కాజల్) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ‘షి’ టీంని లీడ్ చేస్తూ ఉంటుంది. సమాజంలో స్త్రీల క్షేమం కొరకు ప్రవేశపెట్టిన ‘షి సేఫ్ యాప్’ గురించి కూడా అందరికీ అవగాహన కలిగేలా వివరిస్తూ ఉంటుంది. సత్యభామ గురించి తెలుసుకున్న హసీనా(నేహా) అనే అమ్మాయి తన భర్త యదు(అనిరుధ్ పవిత్రన్) పై కంప్లైంట్ ఇవ్వడానికి.. సత్యభామ స్టేషన్ వద్దకి వెళ్తుంది. హసీనాపై యదు దారుణంగా దాడి చేస్తూ ఉంటాడు. చెప్పుకోలేని చోట్ల గాయపరిచి… టాటూలు వేస్తుంటాడు. ఇది తెలుసుకున్న సత్యభామ అతనికి కాల్ చేసి వార్నింగ్ ఇస్తుంది. దీంతో యదు మృగంలా రెచ్చిపోయి హసీనాపై మళ్ళీ దాడి చేస్తాడు. దీంతో హసీనా.. యదుకి ఫోన్ చేస్తుంది. ఆమె వచ్చేలోపే హసీనాని తీవ్రంగా గాయపరుస్తాడు యదు. తర్వాత సత్యభామ కళ్ళముందే హసీనాని చంపేస్తాడు. అయితే ఆమె చనిపోయే టైంకి హసీనా గర్భం దాల్చి ఉంటుంది. దీంతో సత్యభామ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎలాగైనా యదుకి శిక్ష పడేలా చేస్తుంది. మరోపక్క హసీనా తమ్ముడు .. సత్యభామపై కోపం పెంచుకుంటాడు. కానీ అతనికి దగ్గరయ్యి అక్కలా తోడుగా ఉండాలి అని సత్యభామ ప్రయత్నిస్తుంది. కానీ తర్వాత ఊహించని విధంగా అతను టెర్రరిస్ట్ అని సత్యభామకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ : ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. మొదటి 15 నిమిషాలు సూపర్ అనిపిస్తుంది. కానీ తర్వాత పడుతూ లేస్తూ.. పడుతూ లేస్తూ.. సాగుతుంది. ఇంటర్వెల్ ఓ ట్విస్ట్ తో ముగుస్తుంది. అది బాగుంది అని మాత్రం చెప్పలేం. కానీ ఓపిక చేసుకుని ఫస్ట్ హాఫ్ చూడొచ్చు. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీన్ నుండి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటుంది. మధ్యలో వచ్చే హర్ష వర్ధన్ కామెడీ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. అలాగే చిన్న పిల్లల్ని కాపాడటానికి కాజల్ చేసిన ఫైట్ సీన్ కూడా ఓకే.అంతకు ముందు కూడా స్త్రీని కాళికాదేవితో పోలుస్తూ వచ్చే ఫైట్ సీన్ ఆకట్టుకుంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు ఫైట్లు కూడా కథకి సింక్ అవ్వలేదు. అవి సైడ్ ట్రాక్ పట్టినట్టు అయ్యింది. దర్శకుడు సుమన్ చిక్కాల.. శశికిరణ్ తిక్కా డైరెక్షన్ ని మ్యాచ్ చేసే రేంజ్లో ఈ సినిమా చేయలేదు. కొన్ని ఎలిమెంట్స్ అయితే అతని స్థాయిలో డిజైన్ చేసుకున్నాడు.లేకపోతే శశిని డిజైన్ చేశాడేమో అనుకోవాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. అలా అని గొప్పగా చెప్పుకోడానికి ఏమీ లేవు. శ్రీచరణ్ పాకాల సంగీతం సినిమాకి ఆయువుపట్టు అనిపించుకుంది. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ కూడా ఓకే.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. ‘సత్యభామ’ గా కాజల్ తన బెస్ట్ ఇచ్చింది. అలా అని ఆమె కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ అనలేం. లుక్స్ పరంగా ఎక్కడో తేడా కొట్టిన భావన కలుగుతుంది. కొన్ని చోట్ల ఆమె సన్నగా కనిపించింది. మరికొన్ని చోట్ల లావుగా కనిపించింది. ఏదేమైనా కాజల్ క్రేజ్ ను బట్టే.. ఈ సినిమాకి టికెట్లు తెగుతాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ భారాన్ని ఎంతవరకు మోయగలదు అనేది సందేహమే. నవీన్ చంద్ర తనకి అలవాటైపోయిన సెటిల్డ్ రోల్ చేశాడు. కాబట్టి.. అతని నటన గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు. హర్ష వర్ధన్ తన మార్క్ నటనతో మెప్పించాడు. రవి వర్మ, ప్రకాష్ రాజ్,నాగినీడు ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళని పూర్తిస్థాయిలో వాడుకోని సినిమా ఇది. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ కూడా గుర్తుండిపోయే నటన అయితే కనపరచలేదు.

ప్లస్ పాయింట్స్ :

శ్రీచరణ్ పాకాల సంగీతం

కాజల్

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్

సెకండ్ హాఫ్

మొత్తంగా ఈ ‘సత్యభామ’ కాజల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి తప్ప మిగిలిన వాళ్ళని మెప్పించే విధంగా అయితే లేదు. ‘కంటెంట్ తక్కువ పబ్లిసిటీ ఎక్కువ’ అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ గా ఈ సినిమా మిగిలిపోతుంది.

రేటింగ్ : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు