Sarika: కమలహాసన్ తో విడాకులు.. ఆమె పరిస్థితి మరింత దారుణం..?

Sarika.. లోక నాయకుడు.. విశ్వ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమలహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. 6 పదుల వయసు దాటినా కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన ఇటీవలే విక్రమ్ సినిమాతో విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.. వృత్తిపరంగా ఎంతో సక్సెస్ చవిచూసిన కమలహాసన్ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.. ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే క్లాసికల్ డాన్సర్ వాణీ గణపతి నుంచి విడిపోయిన తర్వాత సారికను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ..శృతిహాసన్ , అక్షరాహాసన్ పిల్లలు పుట్టిన తర్వాత ఒకే ఇంట్లో ఉంటూ విడివిడిగా జీవించారు. కూతుర్లతో కలిసి అదే ఇంట్లో ఒక గదిలో తల్లి జీవనం సాగిస్తే ..కమలహాసన్ అదే ఇంట్లో మరోవైపు గదిలో నివసించారు …అసలు కమలహాసన్ – సారిక మధ్య ఆ రోజుల్లో ఏం జరిగింది ? అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ ఒక కథనాన్ని కూడా వండి వార్చింది.. మరి ఆ కథనం సారాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం

కమలహాసన్ తో విడిపోయాక సారిక పరిస్థితి..

కమలహాసన్ – సారిక మధ్య ఉండే గొడవలు అటు శృతిహాసన్, అక్షర హాసన్ ను ఎంతగానో ఇబ్బందికి గురిచేసాయి.. తన కూతుర్ల భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనతో కమల్ హాసన్ ఎంతగానో మదన పడేవారట.. ఈ గొడవలు జరుగుతూనే ఉండగా.. జూన్ 2001న సారిక తన పుట్టినరోజుకు కొద్ది రోజుల ముందు చెన్నైలోని ఎల్డామ్ రోడ్డులోని తన ఇంటి టెర్రస్ నుండి పడిపోయింది.. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉండేందుకు చికిత్స కోసం ఆమెను చెన్నై నుంచి ముంబైకి తరలించారు.. ఇదంతా వారి మధ్య 20 ఏళ్ల అనుబంధానికి ముందు జరిగిన సంఘటన ఇది.

భయం అంతా వారి గురించే – కమలహాసన్..

Sarika: Divorce with Kamala Haasan.. Her condition is worse..?
Sarika: Divorce with Kamala Haasan.. Her condition is worse..?

ఇక తరచూ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు.. సారిక ధైర్యంగా తన నటన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది.. ఇది కమలహాసన్ కు మింగుడు పడలేదు.. ఇక కమలహాసన్ ఒక ఇంటర్వ్యూలో తన మాజీ భార్య కెరియర్ ఎంపికలపై ఆందోళన వ్యక్తం చేశాడు.. ఆమె ఒక సినిమాలో పాటకు డాన్స్ చేసిందని విన్నాను.. సారికకి త్వరలో నేను మాజీ భర్తను అవుతాను.. నా ఆందోళన అంతా పిల్లల గురించి.. వారికి సరైన పోషణ అందించాలి.. వారు నన్ను కోరుకున్నట్లైతే వారికి అన్ని విధాలుగా నేను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.. ముఖ్యంగా వారి చదువుల గురించి నా భయం వారి ఎటువంటి బాధలకు గురికాకూడదు అంటూ కమలహాసన్ తెలిపారు.

- Advertisement -

పిల్లల పోషణ కోసం సారిక కష్టాలు..

అదే సమయంలో పిల్లలను పోషించడానికి థియేటర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది సారిక.. ఇక ఎన్నో ఇబ్బందులను పడి కూతుళ్లను ఉన్నత స్థాయికి చేర్చింది.. ఇక విడాకుల తర్వాత కేవలం వారానికి ఒకసారి మాత్రమే కమల్ హాసన్ తన కూతుర్లను కలుసుకునే వారట.. ఇక కలవడానికి వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయిలు ఇద్దరు పరీక్షలు ఉన్నాయని లేదా ఇతర ముఖ్యమైన పనులలో బిజీగా ఉన్నామని తనతో చెప్పే వారట.. అలా వారానికి ఒకసారి మాత్రమే కలుసుకునేవారుట కమలహాసన్.. ఇక ఆ పిల్లల చదువు కోసం ఎంతో ప్రయత్నం చేశారట.. ఇక సారిక కూడా కూతుర్ల భవిష్యత్తు కోసం అంతకుమించి శ్రమించి వారిని ఉన్నత స్థాయికి చేర్చింది.. శృతిహాసన్ పెద్దమ్మాయి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతోంది. అక్షర హాసన్ చిన్నమ్మాయి.. ఇప్పుడిప్పుడే సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా తల్లిగా సారికా పడ్డ కష్టం అనిర్వచనీయం అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు