HBD Giribabu: తండ్రేమో భారీ సక్సెస్.. కొడుకులకు ఆ సక్సెస్ లేకపోవడానికి కారణం..?

HBD Giribabu.. దిగ్గజ నటుడు, నిర్మాత గిరిబాబు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఇప్పటికే ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.. మరి కొంతమంది కనుమరుగయ్యారు కూడా.. నిజానికి స్టార్ హీరోల కొడుకులు మాత్రమే స్టార్స్ అవ్వడం కాదు.. అప్పుడప్పుడు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల కొడుకులు కూడా హీరోలు అవుతూ ఉంటారు. అయితే వాళ్లకి సక్సెస్ రేట్ చాలా తక్కువగానే ఉంటుంది. ఎంతో కష్టపడి హీరోలుగా పరిచయమైనా నిలబడడం కూడా కష్టమే.. ఇప్పటికే సాయికుమార్, భానుచందర్ లాంటి హీరోలు తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేశారు.. కానీ వాళ్లకు సక్సెస్ అంటే ఏంటో మాత్రం తెలియడం లేదు.

కొడుకుని హీరోగా చూడాలనుకున్న గిరిబాబు..

HBD Giribabu: The father is a huge success.. the reason why the sons don't have that success..?
HBD Giribabu: The father is a huge success.. the reason why the sons don’t have that success..?

మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు గిరిబాబు కూడా తన కొడుకులను ఇండస్ట్రీలోకి హీరోలుగా పరిచయం చేసి వారికి సక్సెస్ అందించాలని ఎంతో ప్రయత్నం చేశారు.. అయితే ఆయన పెద్ద కొడుకు రఘుబాబు ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన చిన్న కొడుకు బోసు బాబు మాత్రం ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు కానీ సక్సెస్ కాలేకపోయారు.. ఇద్దరిలో ఒకరినైనా హీరోగా చూడాలనుకున్న గిరిబాబు కోరిక మాత్రం నెరవేరలేదని చెప్పాలి.

కొడుకును హీరో చేయడం కోసం తండ్రి తాపత్రయం..

ఇకపోతే గిరిబాబు తన చిన్న కొడుకు బోసు బాబును ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు .. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు కానీ నాటి తరం ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే.. అప్పట్లో హీరోగా కొన్ని సినిమాలు కూడా చేశారు బోసు బాబు..ముఖ్యంగా 1980లో బోసు బాబు నటించిన సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.. కానీ ఆయనకు మాత్రం సరైన గుర్తింపు రాలేదు. అలా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు బోసు బాబు.. ముఖ్యంగా ఇంద్రజిత్తు సినిమాతో బోసు బాబును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది కూడా ఈయన తండ్రి గిరిబాబే.. ఇది కౌబాయ్ తరహా చిత్రం

- Advertisement -

ఆ సినిమా వల్లే బోసు బాబు కెరియర్ డౌన్..

అయితే ఇంద్రజిత్తు వచ్చిన సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన కొదమ సింహం సినిమా కూడా వచ్చింది. దీంతో ఇంద్రజిత్తు సినిమాను చాలా తక్కువ రేట్లకే అమ్ముకోవాల్సి వచ్చింది గిరిబాబు.. దీంతో చాలా వరకు నష్టపోయారు.. దర్శకుడిగా , నిర్మాతగా గిరిబాబు తన కొడుకును నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదని చెప్పాలి. అయితే ఇదంతా ఇలా ఉండగా ఒకానొక సమయంలో బోస బాబుకు సినిమాలపై విరక్తి కలిగింది.. అందుకే పూర్తిగా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు

వారే నన్ను హీరో కాకుండా తొక్కేశారు..

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తొక్కేశాడు అని.. ఆయన చాలా పెద్ద హీరో అని కూడా చెప్పుకొచ్చారు.. మరైతే ఆ హీరో ఎవరు ? ఎందుకు బోసు బాబును తొక్కేయాలని చూసారు? అన్న విషయాలపై మాత్రం బోసు బాబు క్లారిటీ ఇవ్వలేదు.. మొత్తానికైతే నటుడిగా గిరిబాబు ఇండస్ట్రీలో భారీ సక్సెస్ అయ్యారు… ఇక తన కొడుకుని హీరోగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కోరిక మాత్రం ఇప్పటికీ కల గానే మిగిలిపోయింది అనడంలో సందేహం లేదు. ఇక సినిమాలకు దూరమైన బోసు బాబు ప్రస్తుతం వ్యాపారంగంలో బిజీగా దూసుకుపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు