Ramoji Rao Death : రామోజీ రావు చివరి సినిమా ఏంటో తెలుసా?

Ramoji Rao Death : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి చెందాడు అన్న వార్త సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇతర ప్రముఖులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామోజీ రావు చివరి మూవీ ఏంటో తెలుసుకుందాం.

రామోజీ రావు చివరి మూవీ ఇదే

రామోజీరావు 1983 లో ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రూపొందించారు. అనతి కాలంలోనే మంచి లాభాలను చవి చూసిన ఈ సంస్థ ద్వారా మయూరి, ప్రతిఘటన లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా రూపొందించి హిట్ కొట్టిన ఘనతను తమ సొంతం చేసుకున్నారు. తెలుగు వెండి తెరకు ఎంతో మంది స్టార్ హీరోలను, హీరోయిన్లను పరిచయం చేసిన రామోజీ రావు నిర్మాతగా రాణించారు. ఉషా కిరణ్ మూవీస్ అనే నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించి, నిర్మాతగా హిస్టరీని క్రియేట్ చేశారు.

2003లో ఒకేసారి రెండు తెలుగు సినిమాలు, రెండు కన్నడ, ఒక తమిళ, ఒక హిందీ చిత్రాలను వెనువెంటనే నిర్మించి క్రియేట్ చేసింది ఉషా కిరణ్ మూవీస్ సంస్థ. ఇక తర్వాత టాలీవుడ్ లో ఎన్నో కొత్త నిర్మాణ సంస్థలు వెలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ సినిమాలో నిర్మించడంలో కాస్త వెనకబడిపోయింది. అయితే ఈ సంస్థలో చివరగా తెరకెక్కిన మూవీ దాగుడుమూత దండాకోర్. 2015లో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీనే ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో రూపొందిన చివరి మూవీ. ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ సినిమాలు రాలేదు.

- Advertisement -

Watch Dagudu Mootha Dandakor movie - Hero Rajendra Prasad as Lead Role on  ETV Win | Download ETV Win on Play Store

అవార్డుల పంట

ఉషా కిరణ్ మూవీస్ ని స్థాపించిన కొన్నాళ్లకే తెలుగుతో పాటు మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమాలను నిర్మించారు. ఈ సంస్థలో తెరకెక్కిన నువ్వే కావాలి, చిత్రం, ఆనందం వంటి సినిమాలు ఇప్పటికీ టాలీవుడ్ మూవీ లవర్స్ కి ఎవర్ గ్రీన్ మూవీస్ అని చెప్పొచ్చు. అలాగే చిత్రం మూవీతో అప్పట్లోనే డైరెక్టర్ తేజ, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక 2000లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన నువ్వే కావాలి మూవీ ఏకంగా నేషనల్ అవార్డును అందుకుని హిస్టరీని క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సంస్థ నిర్మించిన ఎన్నో సినిమాలు నంది అవార్డులను కూడా అందుకున్నాయి.

పట్టిందల్లా బంగారమే

ఆయన అడుగు పెట్టిన ప్రతీ రంగంలోనూ తనదైన శైలిలో పని చేస్తూ సక్సెస్ ఫుల్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవ చీరస్మరనీయమైనది. ఈనాడు, తెలుగు వారి వెలుగు, రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ఆయన తెలుగు వారి ఘనతను ప్రపంచానికి చాటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు