105 Minutes OTT: ఓటీటీలోకి హన్సిక సింపుల్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

105 Minutes OTT: సింపుల్ క్యారెక్టర్ తో హన్సిక ప్రయోగాత్మకంగా చేసిన 105 మినిట్స్ చిత్రం ఓటిటిలోకి వచ్చేసింది. జూన్ 7 అనగా నిన్న ఓటీటీలో ఈ సింపుల్ క్యారెక్టర్ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే రెంటల్ విధానంలో ఈ ఓటీటీలో మూవీ అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ లో హన్సిక మూవీ చూడాలంటే ఓటిటి సబ్స్క్రిప్షన్ తో పాటు అదనంగా 79 రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆహా ఓటీటీలో మాత్రం ఫ్రీ గా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశం తో రూపొందిన ఈ సింపుల్ క్యారెక్టర్ మూవీ కి రాజు దర్శకత్వం అందించారు. జనవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 105 మినిట్స్ మూవీ మొత్తం హన్సిక క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది.

Hansika Simple Movie in OTT.. Free Streaming
Hansika Simple Movie in OTT.. Free Streaming

గంట 45 నిమిషాలు ఆమె తప్ప మరో క్యారెక్టర్ స్క్రీన్ పై కనిపించకుండా దర్శకుడు ఈ మూవీను రూపొందించాడు. జాను (హన్సిక) అనుకోని పరిస్థితుల్లో అదృశ్య శక్తి కారణంగా తన ఇంట్లోనే బందీగా మారుతుంది. జానును చంపాలని ఆ శక్తి ప్రయత్నిస్తుంది. జాను పై ఆ శక్తి పగ పట్టడానికి కారణమేంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ రూపొందింది. హన్సిక యాక్టింగ్ బాగుందనే పేరు వచ్చినప్పటికీ కాన్సెప్ట్ మొత్తం ఒకే పాయింట్ చుట్టూ తిరగడం రిపీట్ సీన్స్ కారణంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు