Sri Leela: ఎట్టకేలకు ఆ రూమర్ ని నిజం చేసిన శ్రీ లీల.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది గా..!

Sri Leela: ఈ మధ్యకాలంలో శ్రీ లీల కెరియర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎప్పుడైతే గుంటూరు కారం చిత్రంలో నటించి ట్రోలింగ్ కి గురైందో అప్పటినుంచి ఈ బ్యూటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లోనే యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న లీల ‌పాపా.. గుంటూరు కారం సినిమా అనంతరం ఎలా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుందో మనం చూస్తూనే ఉన్నాం.

తన పాత్రకు స్కోప్ ఉంటేనే ఆ సినిమాకి ఓకే చెబుతుంది. లేకపోతే ఆ మూవీని రిజెక్ట్ చేస్తుంది. కాగా కొన్నాళ్ల నుంచి హను రాఘవపూడి డైరెక్షన్లో శ్రీ లీల ఓ మూవీ చేయబోతుంది అంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫైనల్లీ ఈ వార్తనే నిజం చేసింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది.

Finally Sri Leela made the rumor come true.. The official announcement has come
Finally Sri Leela made the rumor come true.. The official announcement has come

శ్రీ లీలా త్వరలోనే హను రాఘవపూడి డైరెక్షన్లో నటిస్తుంది. అయితే అది సినిమాలో అనుకుంటే పొరపాటే ఒక యాడ్ కోసం మాత్రమే. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీ లీలా చాలా చక్కగా ట్రెడిషనల్ గా రెడీ అయిన పిక్స్ పక్కనే హను రాఘవపూడి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పిక్స్ ఆమె షేర్ చేసింది. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు