Kajal Agarwal: కాజల్ ” సత్యభామ ” మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. క్రైమ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. ఇక తొలి రోజు సత్యభామ మూవీ కోటికి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక ఈ చిత్రంతో సుమన్ డైరెక్టర్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సత్యభామ ఓటిటి హక్కుల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. సత్యభామ మూవీ ఓటిటి హక్కులను ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటిటిలో మాత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.

Satyabhama Movie Review
Satyabhama Movie Review

థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తరువాత సత్యభామ మూవీ ఓటిటిలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. జులై ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి సత్యభామ మూవీ ఆహా ఓటీటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జూన్ నెలాఖరన సత్యభామ ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు