Tollywood: రామోజీ రావు కు భారతరత్న ఇవ్వాల్సిందే!

 

Tollywood: రామోజీ సంస్థల అధినేత రామోజీరావు మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో…. రామోజీరావు మరణించారు.గత మూడు రోజులుగా రామోజీరావు ఆరోగ్య పరిస్థితి.. విషమించిందట. దీంతో ఆయన ఇంట్లోనే మూడు రోజులుగా వైద్యులు చికిత్స అందించారు. కానీ నిన్న… అర్ధరాత్రి రామోజీరావు గుండెకు అందించిన సమస్య వచ్చిందట. ఈ తరుణంలో వెంటనే హైదరాబాదులోని ఓ ప్రముఖ ప్రవేట్ ఆసుపత్రికి రామోజీరావు ను తరలించారు.

 

- Advertisement -

ఇక ఈ సందర్భంగా రామోజీరావు గుండెకు స్టoట్స్ కూడా వేశారు. అనంతరం వెంటిలేటర్ పైన వేశారు. కానీ ఫలితం దక్కలేదు. రామోజీరావు తుది శ్వాస విడిచారు. ఇక రామోజీరావు మరణం పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఇది ఇలా ఉండగా.. రామోజీరావు మృతి నేపథ్యంలో… కొత్త అంశం తెరపైకి వస్తోంది. రామోజీరావుకు… భారత రత్న ఇవ్వాలని టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి డిమాండ్ వస్తోంది. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Ramoji Rao: These are the star heroes introduced by Ramoji Rao.

రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు రాజమౌళి. స్థితిస్థాపకత, కృషి, ఆవిష్కరణలో ఒక వ్యక్తి 50 సంవత్సరాల పాటు లక్ష మందికి పైగా జీవన ఉపాధి అలాగే ఉపాధి ఆశలను కలిగించాడు. అలాంటి రామోజీరావుకు మనం నివాళులు అర్పించే ఏకైక మార్గం భారతరత్న ప్రధానం చేయడమే అని తెలిపాడు.. అయితే రాజమౌళి చేసిన పోస్ట్‌ పై అల్లు అర్జున్ స్పందించాడు. అదే భావన నాకు ఉంది సార్ అంటూ మరి రిప్లై ఇచ్చాడు. వెంటనే దీనిపై.. కేంద్రం స్పందించి భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు