Tripti Dimri : ముంబైలో లగ్జరీ బంగ్లా కొన్న యానిమల్ హీరోయిన్… ఆ ఇంటి ధర తెలిస్తే మైండ్ బ్లాకే

Tripti Dimri : డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’లో రణబీర్ కపూర్ సరసన తృప్తి దిమ్రీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆమె పోషించిన బోల్డ్ పాత్రకు ఊహించని రెస్పాన్స్ రావడంతో పాటు తృప్తిని ఓవర్ నైట్ స్టార్ చేసేసింది ఈ మూవీ. ప్రస్తుతం ఆమె కెరీర్ యానిమల్ మూవీకి ముందు, ఆ తరువాత అన్నట్టుగా ఉంది. ఈ ఒక్క మూవీతోనే ఆమెకు నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. ‘యానిమల్‌’ తర్వాత తృప్తి చేతిలో ఎన్నో పెద్ద ప్రాజెక్ట్‌లు వచ్చి పడ్డాయి. పీక్స్ లో ఉన్న తన కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్న తృప్తి ఇప్పుడు ముంబైలో తన డ్రీం హౌజ్ ను కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది.

సెలబ్రిటీ ఏరియాలో ఖరీదైన ఇల్లు

ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని కార్టర్ రోడ్‌లో తృప్తి కోట్ల విలువైన ఒక విలాసవంతమైన బంగ్లాను కొనుగోలు చేసింది. ఈ లగ్జరీ బంగ్లా ధర రూ.14 కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి మొత్తం మూడు ఫ్లోర్లు ఈ బంగ్లా ఉన్నట్టుగా సమాచారం. ఈ ఇంటి కోసం తృప్తి రూ.70 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే 30 వేలు రిజిస్ట్రేషన్ ఖర్చు అయ్యిందట. బంగ్లా మొత్తం 2,226 చదరపు అడుగుల విస్తీర్ణం, 2,194 చదరపు అడుగుల బిల్ట్-అప్ ప్రాంతంలో ఉంది. దీని కోసం జూన్ 3న లావాదేవీలతో పాటు డీల్ క్లోజ్ అయినట్టు టాక్ నడుస్తోంది.

Tripti Dimri bags another big role in Bollywood - FilmiFever

- Advertisement -

రణబీర్ ఇంటి పక్కనే..

తాజాగా తృప్తి ముంబైలోని బాంద్రా శివారులో తన కోసం ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసిందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రాంతం చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు నిలయంగా మారింది. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ స్టార్లు నివసించే పాష్ ఏరియా కార్టర్ రోడ్ సమీపంలోనే తృప్తి ఇల్లు కూడా ఉంది. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. దీంతో తృప్తి ఇప్పుడు తన సహనటుడు రణ్‌బీర్ కపూర్‌కి పొరుగువారిగా మారింది. ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తృప్తి చేతిలో అరడజను సినిమాలు

తృప్తి సినిమాల విషయానికొస్తే.. యానిమల్ తెచ్చిపెట్టిన పాపులారిటీతో తృప్తి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఆమె త్వరలో రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లో కనిపించనుంది. దీనితో పాటు ఆమె కార్తిక్ ఆర్యన్, విద్యా బాలన్‌లతో కలిసి ‘భూల్ భూలయ్యా 3’ షూటింగ్‌ లో పాల్గొంటోంది. విక్కీ కౌశల్, అమ్మీ విర్క్‌ లు ప్రధాన పాత్రధారులుగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘బాడ్ న్యూస్’లో తృప్తినే హీరోయిన్. అంతేకాదు సిద్ధాంత్ చతుర్వేదితో ‘ధడక్ 2’ కూడా చేయబోతోంది తృప్తి. ఆమె నెక్స్ట్ మూవీ రిలీజ్ గురించి మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు