Kamal Haasan : కల్కి ట్రైలర్ లో కమల్ కూడా కనిపిస్తారా.?

Kamal Haasan : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుంది. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. మహానటి సినిమా తర్వాత దర్శకుడు నాగి చేస్తున్న సినిమా ఇది. నాగి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసినవి రెండే సినిమాలు అయినా కూడా వాటితో ఎనలేని కీర్తిని సంపాదించాడు. లేకపోతే ఈ సినిమా ను జూన్ 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా అవుతూ వస్తుంది.

అన్ని మంచి శకునములే

ఈ సినిమాని అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి ఇప్పుడు అన్ని బాగా కలిసి వస్తున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ ఎటువంటి సమస్యలను ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కోట్లు పెట్టిన సినిమాలకు సరైన టిక్కెట్ ధర లేక సినిమా హిట్ అయినా కూడా ప్రొడ్యూసర్ నష్టాలను చూడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తో పాటు సినిమా ఇండస్ట్రీ ని కూడా టార్గెట్ చేయడం వలన చాలా నష్టం వాటిల్లింది. అప్పట్లో ఈ సినిమా వచ్చుంటే కల్కి కి కూడా ఆ నష్టం జరిగి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సినిమా రావడం వలన బాగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి అశ్విని దత్ కి మధ్య మంచి అనుబంధం ఉంది.

Kamal Haasan

- Advertisement -

ట్రైలర్ లో కూడా కమల్ హాసన్ కనిపిస్తారు

ఇకపోతే ప్రభాస్ తో పాటు ఈ సినిమాలో చాలామంది పెద్దపెద్ద నటులు నటిస్తున్నారు. కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే వంటి ఎందరో స్టార్స్ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. పోతే ఈ సినిమా మొత్తం నాలుగు భాగాలుగా వస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా మొదటి భాగంలో కమల్ హాసన్ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైం లో ట్రైలర్ రిలీజ్ చేయాల్సింది కాబట్టి ఆ పనులను కూడా జరుపుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి తన వంతు డబ్బింగ్ పూర్తి చేశారు కమల్ హాసన్. ఒకవేళ వస్తున్న కథనాలు ప్రకారం కనిపించేది 20 నిమిషాలైనా కూడా ట్రైలర్ లో కూడా కమల్ కనిపించబోతున్నారని చాలామందికి ఒక క్యూరియాసిటీ మొదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు