Bhaskar Bhatla: ఆ అదృష్టం ఆయనకు మాత్రమే దక్కింది

Bhaskar Bhatla: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సాహిత్య రచయితలలో భాస్కరభట్ల రవికుమార్. ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఎక్కువగా సాహిత్య అందిస్తారు భాస్కర్ పట్ల. పూరి జగన్నాథ్ హరిశంకర్ వంటి దర్శకులతో భాస్కర్ భట్లకు మంచి పరిచయం ఉంది. ఇకపోతే భాస్కర్ బట్టల జర్నీ ప్రత్యేకం. సినిమా జర్నలిస్టుగా కొంతకాలం పాటు ఈటీవీలో పనిచేసే ఆ తర్వాత పాటల రచయితగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.

Bhaskarabhatla

ఇకపోతే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నేడు తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. ఇది సినీ పరిశ్రమతో పాటు రాజకీయ పరిశ్రమలో కూడా కొంత కలిచివేసింది. ఇకపోతే రామోజీరావు నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ ఎంత ప్రత్యేకమైనదో చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఈటీవీ ఛానల్ ద్వారా చాలామంది లబ్ధి పొంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలామంది నటులు, దర్శకులు, హీరోలు పరిచయం అయ్యారు. అయితే నేడు ఆయన చనిపోయిన కారణంగా ఒక్కొక్కరు తమతో ఉన్న జ్ఞాపకాలని తాము పొందిన లబ్ధిని సోషల్ మీడియా వేదికగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే విషయంపై భాస్కరభట్ల రవికుమార్ కూడా స్పందించారు.

- Advertisement -

జీవితకాల జ్ఞాపకం

“రామోజీరావు గారి సంస్థలో జర్నలిస్ట్ గా, పాటల రచయిత గా పనిచేసే అవకాశం బహుశా నాకే దొరికిందనుకుంటా. పోస్టర్ల మీద ఆయన పేరుతో పాటు నా పేరు చూసుకోడం ఓక జీవితకాల జ్ఞాపకం. రామోజీరావు గారికి వినయపూర్వక శ్రద్ధాంజలి” అంటూ ట్విట్టర్ వెతికా తెలిపారు. ఇకపోతే రవి బాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే, నువ్విలా వంటి సినిమాలలో పాటలను రాశారు భాస్కర్ భట్ల. ఆ రెండు సినిమాలను నిర్మించింది రామోజీరావు. అందుకోసమే సినిమా జర్నలిస్టుగా పనిచేసిన ఆ సంస్థలోనే సాహిత్య రచయితగా పనిచేయటం అనేది ఒక అచీవ్మెంట్ అంటూ ఆయన జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు