SaripodhaSanivaaram update: అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటున్న సరిపోదా శనివారం

SaripodhaSanivaaram update: మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బ్రోచేవారెవరా అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. వివేక్ ఆత్రేయను ఒక దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబెట్టింది. వివేక్ కు ప్రత్యేకంగా కొంత ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. అయితే వివేక్ నాని కాంబినేషన్లో వచ్చిన సినిమా అంటే సుందరానికి.

కమర్షియల్ గా హిట్ కాలేదు

అంటే సుందరానికి సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా ఒక ఎమోషన్ అని ఫీలయిన వాళ్లు కూడా ఉన్నారు. కేవలం చాలామంది ప్రేక్షకులకు మాత్రమే కాకుండా నానికి కూడా ఈ సినిమా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్ గా ఈ సినిమాను నాని నమ్మాడు. నాని దృష్టిలో ఈ సినిమాకి ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ అనేది ఉంది. అలానే చాలామంది కూడా ఈ సినిమాను భావిస్తారు.

 Saripodhaa Sanivaaram

- Advertisement -

షూటింగ్ అప్డేట్

అంటే సుందరానికి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. అయితే మళ్లీ వీరి కాంబినేషన్లో సరిపోదా శనివారం అనే ఒక సినిమా వస్తుంది. ఎవరికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కూడా చాలామందిని ఆకట్టుగా ఉంది. అయితే ఈ సినిమాలో కమర్షియల్ టచ్ ఉంది అని రిలీజ్ చేసిన వీడియో పెట్టి అర్థం అవుతుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుపుకుంటుంది. షూటింగ్లో సాయికుమార్, నాని, ఎస్ జె సూర్య ఉన్నారు. ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు