Ram Charan – Varun Tej : ఇద్దరు మెగా హీరోలు షెడ్యూల్ కి సిద్ధం అయ్యారు

Ram Charan – Varun Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమా పరిశ్రమ లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్రణ వేశారు. 2014లో జనసేన అనే పార్టీని స్థాపించి ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా నడుపుని వచ్చారు. పదవి లేకపోయినా కూడా ఎక్కడా నిరాశ చెందకుండా ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు. 2019లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు అయితే రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ పైన చాలా విమర్శలను సంధించారు చాలామంది, అయితే వారందరికీ ఇప్పుడు ధీటుగా సమాధానం చెప్పాడు.

Varun Tej

ఇకపోతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్ళిన విషయం తెలిసిందే అయితే కుటుంబం అంతా కూడా ఘనంగా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. దీనిలో సాయి దుర్గ తేజ్ చేసిన హడావిడి అంత ఇంతా కాదు. ఆ వీడియో చూస్తే సాయి తేజకు ఎంత ప్రేమ ఉందో చాలామందికి అర్థం అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం సెలబ్రేషన్స్ అన్ని పూర్తయిన తర్వాత ఇద్దరు మెగా హీరోలు కూడా తమ షెడ్యూల్స్ లో బిజీగా మారనున్నారు.

- Advertisement -

ప్రస్తుతం వరుణ్ తేజ్ పలాస ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. లేకపోతే ఈ సినిమా ఈ మధ్యకాలంలో గ్యాప్ తీసుకుంది ప్రస్తుతం మళ్ళీ ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను త్వరలోనే ప్లాన్ చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. లేకపోతే రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుపుకుంటుంది. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మొత్తానికి సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత సినిమా పనుల్లో పడిపోయారు మెగా హీరోస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు