Prabuthwa Junior Kalashala : మరో నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ

Prabuthwa Junior Kalashala : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో వచ్చినా కూడా కొంచెం సేఫ్ జోన్ లో ఉండే జోనర్ అంటే లవ్ స్టోరీస్ అని చెప్పొచ్చు. ఈ జోనర్ లో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ప్రాపర్ లవ్ స్టోరీ అంటే తక్కువగా ఉంటాయి. మణిరత్నం తీసిన కొన్ని లవ్ స్టోరీ సినిమాలో అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో సుకుమార్ చేసిన ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ లవ్ స్టోరీస్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. అలానే బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం వంటి సినిమాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఉన్న దర్శకులలో హను రాఘవపూడి మంచి లవ్ స్టోరీస్ తీస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు.

Prabuthwa Junior Kalashala

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కొన్ని బోల్డ్ సినిమాలు కూడా వస్తున్నాయి. అయితే వీటి పైన విమర్శలు వచ్చినప్పుడు బయట జరిగేది చూపిస్తున్నామని కొంతమంది దర్శకులు అంటారు. మరి కొంతమంది యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను నిర్మించే మందు చెప్పుకుంటూ వస్తారు. ఇక రీసెంట్ టైమ్స్ లో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమా అందరికీ నచ్చింది అని చెప్పలేము చాలామంది ఇదొక నిబ్బా లవ్ స్టోరీలా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

మరో నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి సినిమా మరొకటి రాబోతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల అని పేరుతో ఒక సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ రిలీజ్ అయింది. కాలేజీలో జరిగే ఒక లవ్ స్టోరీని చూపించే ప్రయత్నం చేశారని ఈ ట్రైలర్ చూడగానే అర్థమవుతుంది. ఈ సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారంగా చేసినట్లు తెలుస్తుంది. శ్రీనాథ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ట్రైలర్  వాసు మరియు కుమారి అని రెండు క్యారెక్టర్ల మధ్య ప్రేమను చూపించడంతోపాటు ప్రేమ విఫలమయ్యాక కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయని కూడా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇదేమైనా ఇటువంటి సినిమాలను కొన్నిసార్లు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు. అంతమందికి నచ్చకపోయినా కొంతమంది మాత్రం ఈ సినిమాను ఆదరిస్తారు అని కొంతమంది అభిప్రాయం. మొత్తానికి మరో నిబ్బ లవ్ స్టోరీ వస్తుంది అంటూ కొంతమంది ట్రోల్ కూడా మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు