Rana : బాలీవుడ్ పీరియాడిక్ మూవీలో ప్రతినాయకుడిగా రానా?

Rana : టాలీవుడ్ హల్క్ రానా గత కొన్నాళ్లుగా ఎలాంటి సినిమాలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత స్పీడు తగ్గించిన రానా, ఇప్పుడిప్పుడే స్పీడ్ అవుతున్నాడు. ఇక రెండేళ్ల కింద విరాట పర్వం లో నటించిన రానా సినిమాలకి గ్యాప్ బాగానే ఇచ్చాడు. ఇక ప్రస్తుతం రానా మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఇక ప్రస్తుతం రానా ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD సినిమాకి సంబంధించి అన్ని ప్రమోషన్స్ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక లాస్ట్ ఇయర్ కూడా పెద్దగా సినిమాలు చేయకపోగా, ఈ ఇయర్ లో తాజాగా న‌వ‌దీప్ న‌టించిన ‘ల‌వ్ మౌళి’ మూవీలో అఘోర పాత్ర‌లో న‌టించారు. ఈ పాత్ర‌లో రానా ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేశారు. అయితే ఇది గెస్ట్ అప్పీరెన్స్ మాత్రమే. కాగా, ఆయ‌న ప్ర‌స్తుతం రానా (Rana) హిందీలో ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కు సీక్వెల్ పార్ట్ లో న‌టిస్తున్నారు. ఇందులో మ‌రో స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ కూడా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ముంబై లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కు రానుంది.

Rana is acting in a Bollywood period movie

బాలీవుడ్ పీరియాడిక్ మూవీలో రానా?

అయితే, రానా త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ మూవీలో న‌టించేందుకు రెడీ అవుతున్నార‌ట‌. బాలీవుడ్ డైరెక్ట‌ర్ అమిత్ రాయ్ త్వ‌ర‌లో తెర‌కెక్కించే పీరియాడిక్ మూవీలో రానా కూడా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో షాహిద్ క‌పూర్ శివాజీ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, రానా ఔరంగ‌జేబ్ పాత్ర‌లో న‌టిస్తాడ‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక త్వ‌రలోనే ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు వాకావో ఫిల్మ్స్ తో క‌లిసి ప్రొడ్యూస్ చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు అఫీషియ‌ల్ గా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలే కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి.

- Advertisement -

బిజీ అవుతున్న రానా..

ఇక పెళ్లి తర్వాత కాస్త విరామం తీసుకున్న రానా (Rana), ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు. ఇక తమిళ్ లో ఆల్రెడీ రజినీకాంత్ తో ‘వేట్టయిన్’ సినిమాలో నటిస్తుండగా, త్వరలో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఇక తేజ దర్శకత్వంలో ఆల్రెడీ నేనే రాజు నేనే మంత్రి సినిమా చేయగా, ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ దానికి సీక్వెల్ గా రాక్షస రాజు సినిమా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయ్. ఆల్రెడీ సినిమా అనౌన్స్ చేయగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే రానా నాయుడు, తమిళ్ వేట్టాయిన్ సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాతే రాక్షస రాజు సినిమా మొదలుపెట్టనున్నాడు. ఇక ఈ సినిమా చేస్తూనే రానా బాలీవుడ్ లో సినిమా చేయనున్నాడు. ఇక రానా హిందీలో కూడా పలు సినిమాలతో సుపరిచితుడే అన్న విషయం తెలిసిందే. అక్కడ ఆల్రెడీ పలు సినీమాల్లో నటించిన రానా ఇప్పుడు చాలా రోజుల తర్వాత సినిమా చేయనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు