Ashika Ranganath : టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ “ఆశికా రంగనాథ్”. కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన అందాల నటి ఆషికా రంగనాధ్. అయితే మొదటి సినిమానే ఫెయిలైనా ఈమెకి నటిగా మంచి పేరు తీసుకురాగా, తన గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సంక్రాంతి కి వచ్చిన ‘నా సామి రంగ’ సినిమాతో మాస్ ఆడియన్స్ కి రీచ్ అయింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంది. ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’ సినిమాలోనూ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీలకపాత్రలో నటిస్తుంది. ఇక చిరు సినిమాలో అవకాశం రావడం పట్ల ఆషికా రంగనాథ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇక ఇదే వేలో వెళ్తే నటిగా మరింత బిజీ అవుతుందని అంతా భావిస్తున్నారు. వీటన్నింటిని మించి అందాల భామగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది ఆషికా. అలాగే నెట్టింట అమ్మడి ఫోటోషూట్లు అంతకంతకు క్రేజ్ ని రెట్టింపు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సక్సెస్ ఫుల్ హీరోయిన్ తాజాగా ఓ ఫెయిల్యూర్ హీరో సినిమాకు సైన్ చేసిందట.
సిద్ధార్థ్ సినిమాలో అషికా..
ఇక సరిగ్గా ఇదే సమయంలో ఆషీకా రంగనాథ్ ప్లాప్ హీరో సిద్ధార్ద్ సినిమాకి సైన్ చేయడం ఆసక్తికరంగా మారింది. సిద్ధార్ధ్ హీరోగా రాజేష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా ఆషీకా రంగనాథ్ ఎంపికైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆషీకా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఎంపికపై ఆషీకా రంగనాథ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్లాప్ హీరోతో సినిమా ఏంటి? అని విమర్శిస్తున్నారు. ఎందుకంటే హీరో సిద్దార్ధ్ హిట్టు కొట్టి చాలా రోజులైంది. హీరోగా ఎప్పుడో పదేళ్ల కింద బహుశా హిట్ కొట్టి ఉంటారు. ఈ గ్యాప్ లో హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కూడా నటించాడు. అయినా కలిసి రాలేదు. సిద్దార్ధ్ హీరోగా ఫేం కోల్పోయి చాలా కాలమవుతోంది. సరైన హిట్ కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. రీసెంట్ గా రెండేళ్ల కింద సిద్దార్ధ్ కు తెలుగులో ‘మహా సముద్రం’ చేయగా, ఆ సినిమా కూడా ప్లాప్ కావడంతో తర్వాత అవకాశాలే రాలేదు. అంతకు ముందు..ఆ తర్వాత తమిళ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో ఆషీకా సిద్దార్ధ్ కి జోడీగా కమిట్ అవ్వడం కెరీర్ కి కలిసొస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అన్నిచోట్లా పాగా వేయాలని ప్లానా?
ఇక ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) కన్నడ ఇండస్ట్రీ లో ముందుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ దాదాపు పదికి పైగా హీరోయిన్ గా సినిమాలు చేసి సక్సెస్ అయింది. ఆ తర్వాత తమిళ్ లో పత్తు ఆర్సన్, అలాగే తెలుగులో అమిగోస్ తో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. ఇక త్వరలో మలయాళంలోనూ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఇక ఒక ఇండస్ట్రీలో కలిసిరాకపోయినా మరో ఇండస్ట్రీలో ఫామ్ లో ఉండాలని భావించి అన్ని ఇండస్ట్రీల సినిమాలకు సైన్ చేస్తున్నట్టు ఉంది ఆషికా. ఏది ఏమైనా టాలెంట్ ఉన్న ఈ గ్లామర్ హీరోయిన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాలతో బిజీ కానున్నట్టు సమాచారం.