Premgi Amaren.. ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు లేటు వయసులో కూడా వివాహం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. అయితే అందరూ యంగ్ స్టర్స్ వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంటే ఇప్పుడు కొంతమంది సీనియర్లు మాత్రం ఇన్ని రోజులు సినిమాలకే తమ కెరీర్ ను అంకితం చేసి.. ఇప్పుడు లేటు వయసులో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో తాజాగా కోలీవుడ్లో కమెడియన్ గా, మ్యూజిక్ కంపోజర్ గా పేరు సంపాదించిన నటుడు ప్రేమ్ జీ అమరేన్.. తాజాగా ఈయన వైవాహిక బంధం లోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది.. ఇందు అనే అమ్మాయిని ఈ రోజున తిరుత్తన గుడిలో వివాహం చేసుకోవడం జరిగింది. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ కమెడియన్ వివాహం చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రేమ్ జీ సోదరుడు వెంకట్ ప్రభు క్లారిటీ..
![Premgi Amaren: Who is the star comedian who got married at the age of 45?](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/06/Untitled-2024-06-09T080249.694.jpeg)
ఈ విషయాలను ప్రేమ్ జీ సోదరుడు అయిన ప్రముఖ డైరెక్టర్ వెంకట ప్రభు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.. పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కమెడియన్ ప్రేమ్ జీ పెళ్లి వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి .. ముఖ్యంగా 45 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవడంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఎక్కడ కూడా ఈ విషయాలపైన ప్రేమ్ జీ రియాక్ట్ కాలేదు. ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ వెంకట్ ప్రభు నేరుగా ప్రేమ్ జీకి సంబంధించి కొన్ని పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్గా ప్రేమ్ జీ కెరియర్..
ప్రేమ్ జీ ఎవరో కాదు ప్రముఖ డైరెక్టర్ సంగీత విద్వాంసుడు అయిన గంగై అమరన్ కుమారుడే.. చిన్న వయసు నుంచి సంగీతం పైన బాగా ఇష్టం ఉండడం చేత మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ప్లే బ్యాక్ సింగర్ గా కూడా కొన్ని సినిమాలకు పని చేశారట. అలాగే సౌండ్ ట్రాక్ ఆల్బమ్స్ కోసం సొంతంగానే కంపోసులు చేసి కొన్నిటిని రీమిక్స్ చేసినట్లు సమాచారం. మొట్టమొదటిసారిగా 2006లో వచ్చిన వల్లవన్ అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి తన కెరీయర్ ను మొదలుపెట్టారు.
వైరల్ గా మారుతున్న పెళ్లి ఫోటోలు..
ఆ తర్వాత ప్రేమ్ జీ ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి మంచి క్రేజ్ సంపాదించారు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ప్రేమ్ జీ కి సంబంధించి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా లేటు.వయసు లో పెళ్లి చేసుకున్న ప్రేమ్ జి మళ్లీ సినిమాలను కొనసాగిస్తారా లేక వైవాహిక బంధానికి ప్రాధాన్యత ఇస్తారా చూడాల్సి ఉంది.
View this post on Instagram