Samantha: ఆ హీరోతో సినిమా చేయవద్దని సమంతపై ఒత్తిడి ?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో గత 14 సంవత్సరాలుగా… స్టార్ హీరోయిన్గా సమంత కొనసాగుతోంది. ఎక్కడ తగ్గకుండా… తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది సమంత. మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… తన జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.

నాగచైతన్య తో పెళ్లి ఆ తర్వాత విడాకులు… జరగడం మనం చూసాం. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత ఒంటరిగానే జీవితాన్ని గడిపేస్తోంది. అయితే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన వెంటనే… పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఓకే చెప్పింది సమంత. దీంతో అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అయితే ఇలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేస్తే… నీ కెరీర్ పాడవుతుందని కుటుంబ సభ్యులు సమంతను హెచ్చరించారట.

- Advertisement -

అలాగే సమంత ఫ్రెండ్స్ కూడా…. బాగా ఒత్తిడి చేశారట. కానీ వాటన్నిటినీ పక్కకు పెట్టి… అల్లు అర్జున్ పక్కన చిందులు వేసి రచ్చ చేసింది సమంత. ఈ సాంగ్ హిట్ కావడమే కాకుండా సినిమా కూడా బంపర్ హిట్ అయింది. ఇలా ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా ముందుకు సాగింది సమంత. కాగా ప్రస్తుతం మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు