Director Shankar.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్ శంకర్ భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ముఖ్యంగా కొత్తవారితో సినిమా చేసినా సరే భారీగానే తెరకెక్కిస్తూ ఉంటారు.. అందుకు చిన్న ఉదాహరణ బాయ్స్.. తొలి రోజుల్లోనే జెంటిల్మెన్ ఒకే ఒక్కడు వంటి చిత్రాలతో భారీతనాన్ని చూపించి నిరూపించుకున్న డైరెక్టర్ శంకర్ తర్వాత ఇండియన్, రోబో, అపరిచితుడు, ఐ వంటి చిత్రాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.. ముఖ్యంగా ఈ చిత్రాల పైన ఏ రేంజ్ లో ఖర్చుపెట్టారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు..
కోలీవుడ్ లో ఇండియన్ -2..
ప్రస్తుతం కోలీవుడ్లో ఇండియన్ 2, తెలుగులో గేమ్ ఛేంజర్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కమలహాసన్ తో తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా షూటింగు దాదాపుగా పూర్తయింది. జూలై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రావడానికి ముస్తాబు అవుతోంది.. ఇటీవలే ఆడియో లాంచ్ కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఇందులో కాజల్ అగర్వాల్ ఉంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించడం లేదని.. ఇండియన్ 3 లో ఆమె నటిస్తోంది అని చెప్పి అభిమానులను నిరాశకు గురి చేశారు..
రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్..
ఇదిలా ఉండగా మరొకవైపు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా పైన.. దీంతో దర్శకుడు ఈ సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించి షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
శంకర్ చూపు ఆ హీరో పైనే..
ఇకపోతే ఈ సినిమాలో తర్వాత శంకర్ నుంచి రాబోయే చిత్రం ఏమిటి? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వైరల్ గా మారుతోంది. అందుకు సమాధానంగా ఒక ఆసక్తికరమైన సమాధానం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అటు కమల్ హాసన్ ఇటు రాంచరణ్ లతో సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈయన మరో కోలీవుడ్ స్టార్ హీరో అయిన అజిత్ తో భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఇదే నిజమైతే అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పవచ్చు.
అజిత్ సినిమాలు..
ఇక అజిత్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో సూపర్ క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.. ప్రస్తుతం మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో విడాముయర్చి చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు.. ఇక అదే సమయంలో తన 63వ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత అజిత్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు సమాచారం..
బాహుబలిని మించి భారీ ప్లాన్..
ఇకపోతే అజిత్ – శంకర్ ల క్రేజీ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక సినిమా కూడా రాలేదు.తాజాగా బాహుబలి చిత్రాన్ని మించి భారీ బడ్జెట్ తో చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఎదురుచూడాల్సిందే.