Jagapathi babu: హీరోయిన్లతో అలాంటి పని.. చివరికి..?

Jagapathi babu.. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా పేరు పొందిన హీరో జగపతిబాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ఫేడ్ అవుట్ హీరోగా మారిపోయిన జగపతిబాబు… లెజెండ్ సినిమాతో ఒక్కసారిగా విలన్ క్యారెక్టర్ లో నటించి అద్భుతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక అప్పటి నుంచి టాలీవుడ్ లో ప్రతి సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ లో తన విలనిజం చూపించి ప్రేక్షకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నారు జగపతిబాబు. జగపతిబాబు పర్సనల్ లైఫ్ లో కూడా చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయని.. కుటుంబ విషయంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

జూదం ఆర్థిక ఇబ్బందులు..

Jagapathi babu: Such work with heroines.. in the end..?
Jagapathi babu: Such work with heroines.. in the end..?

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు కొన్ని విషయాలను వెల్లడించారు.. కోట్ల ఆస్తులతో హ్యాపీగా ఉండాల్సిన జగపతిబాబు.. తన చేజాతులారా ఆర్థిక ఇబ్బందులలోకి పడిపోయారని తెలియజేశారు. జగపతిబాబు గతంలో ఎక్కువగా జూదం ఆడేవారని.. అందుకే చాలా డబ్బులను పోగొట్టుకున్నారనే ప్రచారం కూడా వినిపిస్తూ ఉండేది.. దీనివల్ల ఆర్థికంగా దెబ్బతిన్నారని వార్తలు వినిపిస్తూ ఉండేవి. కానీ జగపతిబాబు ఈ విషయాలను మాత్రం పక్కన పెట్టి తన ఆర్థిక సమస్యలకు కేవలం జూదం ఒక్కటే కాదని తన జీవితంలో ఒక పెద్ద గ్యాంబ్లింగ్ కూడా జరిగింది అని తెలిపారు.

అమ్మాయిల కోసం అలాంటి పని..

చాలామంది హీరోయిన్లకు, మహిళలకు పెద్ద ఎత్తున కాస్ట్లీ గిఫ్ట్ లు ఇవ్వడం వల్లే మీ దగ్గర ఉన్న ఆస్తులను పోగొట్టుకోవలసి వచ్చిందా? అనే ప్రశ్న యాంకర్ వేయగా.. అందుకు జగపతిబాబు ఇలా తెలియజేస్తూ.. హీరోయిన్లకు గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశం నాకు అసలు లేదు.. మహిళలను సైతం నేను అంత చీప్ గా ఎప్పుడు భావించను.. వారిని కలిసినప్పుడు చాలా బాగా ట్రీట్ చేస్తా. ఖర్చుకు వెనకాడను.. ప్రత్యేకించి హీరోయిన్లతో పార్టీకి వెళ్లినప్పుడు ఎంత డబ్బు అయినా కూడా నేనే కడతాను.. అలా హీరోయిన్లే కాకుండా ఎవరైనా సరే నాతో డిన్నర్ చేస్తే నేనే బిల్ కట్టేవాడినని తెలిపారు. అలా చాలామంది షాపింగ్ చేసినా కూడా తానే బిల్లు కట్టేవాడినని తెలిపారు.

- Advertisement -

ఆ తప్పే రూ.25 కోట్ల నష్టాన్ని మిగిల్చింది…

చాలా సినిమాల నిర్మాతలకు సైతం డబ్బులు వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని.. ఇదంతా ఒక ఎత్తు అయితే తను ఒకానొక సమయంలో అప్పు తెచ్చి ఇల్లు కట్టడం కూడా చాలా మైనస్ గా మారిపోయింది అంటూ తెలిపారు.. అలా వడ్డీల రూపంలో సుమారుగా రూ.25 కోట్లకు పైగా నష్టపోయానని వెల్లడించారు. తన దగ్గరకి ఎవరైనా అనారోగ్య సమస్యతో వస్తే ఖచ్చితంగా వారికి సహాయం చేసే వాడినని.. ఇలాంటి మంచితనం వల్లే తనను మోసం చేసిన వాళ్లు కూడా ఉన్నారని వెల్లడించారు.

జగపతిబాబు కెరియర్..

మొదట్లో విలన్ గా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్న జగపతిబాబు. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మరింత పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు హీరోగా అవకాశాలు తగ్గిన క్రమంలో విలన్ గా చేస్తూ పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు