GunturKaram : రమణ గాడి మాస్ వన్ మ్యాన్ షో తో సిల్వర్ జూబ్లికి పరుగులు..

GunturKaram : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన “గుంటూరు కారం” సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అతడు, ఖలేజా లాంటి క్లాసిక్ సినిమాల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రావడం వల్ల గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, సంక్రాంతికి ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షలుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. త్రివిక్రమ్ పేలవమైన దర్శకత్వమే దానికి కారణం అని చాలా మంది భావించారు. దానికి తోడు కథ పరంగా కూడా గుంటూరు కారం ఆకట్టుకోలేకపోయింది. నిజానికి ఈ సినిమా ఆ టాక్ కి ప్లాప్ అవుతుందని అనుకున్నారు అందరూ. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ మ్యాన్ షో తో ఈ సినిమాను ప్లాప్ అయ్యే దశనుండి యావరేజ్ దాకా తీసుకొచ్చాడు. ఇక సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ వలన భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టి, మహేష్ బాబు కి మరో 100 కోట్ల సినిమా అందించింది. ఇక గుంటూరు కారం (GunturKaram) మూవీ ఓటిటి లో రిలీజ్ అయ్యాక కూడా రమణగాడి దెబ్బకు ఓటిటి రికార్డులు బద్ధలవుతున్నయి.

Mahesh Babu starrer GunturKaram has completed 150 days in theatres

మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ రిజల్ట్..

అయితే గుంటూరు కారం సినిమాలో పాటలు మాత్రం మహ రంజుగా హిట్ అయ్యాయి. ఏ ఊళ్ళో చూసిన ప్రస్తుతం ఈ పాటలే వినిపిస్తున్నాయి. యూట్యూబ్ లో పాటలన్ని రికార్డు వ్యూస్ తో ముందుకు సాగుతుండగా అందులో ముఖ్యంగా “కుర్చీ మడతపెట్టి” సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఆ పాటలో థమన్ బీజీఎమ్ కి, దానికి తగ్గట్టు మహేష్ బాబు మాస్ డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట కోసమే థియేటర్లకు వచ్చిన వారు కూడా ఉన్నారు. దాంతో పాటు దమ్ మసాలా సాంగ్ లో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ కి విజిల్స్ పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా గుంటూరు కారం సినిమా మరో అరుదైన రికార్డును అందుకుంది.

- Advertisement -

సిల్వర్ జూబ్లీకి పరుగులు..

ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం (GunturKaram) సినిమా వంద కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా, 190 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక ఈ సినిమా డిజిటల్ లోనూ దుమ్ములేపుతుండగా, తాజాగా అరుదైన రికార్డుకి దగ్గర్లో ఉంది. గుంటూరు కారం సినిమా తాజాగా 150 రోజులు పూర్తయినట్టు వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా నేటితో 150 రోజులు పూర్తి చేసుకోగా, తాజాగా చిలకలూరి పేట లో వెంకటేశ్వర థియేటర్ లో రోజుకు 4 ఆటలతో 150 రోజులను పూర్తి చేసుకుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ అసోసియషన్స్ నుండి అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ కాగా, గుంటూరు కారం ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కి పరుగులు తీస్తుందని చెప్పాలి. ఇక కేవలం మహేష్ బాబు వన్ మ్యాన్ షో తోనే ఈ రికార్డులు సాధ్యమని చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు