Anchor Pradeep: బుల్లితెరపై యాంకర్ సుమ ఎంత పేరు సంపాదించుకుందో .. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా అంతే పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, గడసరి అత్త సొగసరి కోడలు, ప్రదీప్ పెళ్లి చూపులు వాంతి షో లతో ఇంకాస్త గుర్తింపు సొంతం చేసుకున్నాడని చెప్పాలి. తన అద్భుతమైన వాక్చాతుర్యంతో.. కామెడీ సీన్స్ తో అటు జడ్జెస్ ఇటు ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు.. అందుకే ప్రదీప్ యాంకరింగ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఈయన యాంకరింగ్ కి పడి చచ్చిపోతారు అంతే.. అంతలా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అలరించే ప్రదీప్.. ఎప్పుడు బుల్లితెర షోలే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా అలరిస్తూ ఉంటాడు. అత్తారింటికి దారేది తో పాటు పలు స్టార్ హీరోల సినిమాలలో సందడి చేసిన ప్రదీప్ హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.
హీరోగా మరో సినిమాతో రానున్న ప్రదీప్..
![Anchor Pradeep: Another movie as the hero.. Shock if you know who the heroine is this time..!](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/06/Untitled-2024-06-09T160505.105.jpeg)
ఈ సినిమా ఒక మోస్తారు విజయాన్ని అందించింది.. ఇందులో ప్రముఖ హీరోయిన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించినది..ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి.అంతేకాదు తన అద్భుతమైన నటనతో హీరోగా సక్సెస్ అయ్యారు ప్రదీప్.. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆయన పెద్దగా వెండితెరపై కనిపించలేదు .. కానీ తాజాగా ఈయన గురించి ఒక వార్త మళ్ళీ వైరల్ గా మారింది. ఇప్పుడు మరో సినిమాకి హీరోగా సంతకం చేశాడు అని.. ఒక క్రేజీ హీరోయిన్ ఇందులో అవకాశం దక్కించుకుంది అని సమాచారం.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రదీప్ సెకండ్ మూవీలో ఆమె హీరోయిన్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఢీ షో ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పిల్లి , ప్రదీప్ నటించబోయే సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.. ఇకపోతే వీరిద్దరూ కూడా ఢీ షోలో యాంకర్లుగా కలిసి పని చేసిన విషయం తెలిసిందే . ఇప్పుడు వీరిద్దరూ కలిసి హీరో , హీరోయిన్గా సినిమా చేస్తున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉందని.. త్వరలోనే అధికారికంగా అప్డేట్ వెలువడనుంది అని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? ఏ తరహా కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కబోతోంది ? అనే విషయాలు అన్నీ కూడా త్వరలోనే తెలియనున్నాయి.
దీపికా పిల్లి కెరియర్..
ఇక దీపికా పిల్లి కెరియర్ విషయానికి వస్తే.. టిక్ టాక్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఢీ షోలోకి అడుగుబెట్టింది. రష్మీ తో కలిసి ఈమె డాన్సర్లకి సంబంధించి టీం లీడర్ గా వ్యవహరించింది. కామెడీ స్టార్స్ తో పాటు పలు షోస్ చేసిన ఈమె సినిమాలలో కూడా నటించింది. సుడిగాలి సుదీర్ హీరోగా నటించిన వాంటెడ్ పండుగాడు సినిమాలో హీరోయిన్గా చేసింది.. ఆ తర్వాత దీపికాకి కూడా ఆఫర్లు లేవు.. సోషల్ మీడియాలో ఫోటోలతో హల్చల్ చేస్తున్న ఈమె.. కొంత గ్యాప్ తో ఇప్పుడు మళ్ళీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. ఇకపోతే ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.