Kalki Deepika poster: కల్కి నుంచి దీపిక నయా పోస్టర్.. అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నారుగా..!

Kalki Deepika poster: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా మూవీ కల్కి. ఈ చిత్రం కోసం ఒకపక్క ప్రభాస్ అభిమానులతో పాటు మరోపక్క ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలను నెలకొల్పింది. మెయిన్ గా దర్శకుడు విజన్ అందరిలో చాలా నమ్మకం ఉంది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి నటి దీపిక పదుకొనే తాలూకా నయా పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో దీపిక ఎమోషనల్ గా కనిపించింది. ఒక ఆశ మొదలైంది ఆమెతోనే అన్నట్లుగా తెలిపారు.

ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బ్యాగ్రౌండ్ వర్క్ అంతా చూస్తుంటే బిగ్ స్క్రీన్ పై విజువల్ గా చాలా గ్రాండ్ ట్రీట్ ఇచ్చే లాగానే కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా విజయశాంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు