Viduthalai Part 2 : విడుతలై రిలీజ్ అయ్యేది అప్పుడే

Viduthalai Part 2 : సంచలన దర్శకుడు వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా వెట్రిమారన్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. వెట్రిమారన్ మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. వెట్రిమారన్ ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. కేవలం హిట్ అవ్వడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలను కూడా రాబట్టుకుంటాయి. సౌత్ సినిమాకి అటువంటి ఫిలిం మేకర్ ఉండటం చాలా గర్వంగా ఫీల్ అవుతారు. వెట్రిమారన్ నుంచి వచ్చిన విడుదలై సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమా పార్ట్ 2 పై అందరికీ మంచి అంచనాలు నెలకొన్నాయి.

Viduthalai Part

విడుదలై సినిమా కథ విషయానికి వస్తే అడవి బిడ్డలైన గిరిజనులకు, పోలీస్ వారికి మధ్య నడిచే పోరాటంగా ఈ కథ తెరకెక్కుతుంది. గిరిజనులకు అండగా విజయ్‌ సేతుపతి పెరుమాళ్‌గా కీలకపాత్ర లో కనిపిస్తారు, సూరి కానిస్టేబుల్‌ పాత్ర పోషిస్తున్నాడు. పోలీసులకు సమస్యగా మారిన పెరుమాళ్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు గిరిజనులను హింసిస్తుంటారు. అప్పుడు పెరుమాళ్ పోలీసులను ఎలా అడ్డుకుంటాడు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు సూరి తన పై అధికారులకు ఎలాంటి సహాయం చేశాడు అనే అంశాలను సినిమాలో చూపించారు. మనిషి పుట్టగానే.. ఒకరు పైన, ఇంకొకరు కింద, మరొకరు ఇంకా కింద అని వేరు చేసే మీరు వేర్పాటువాదులా? లేదా అందరం సమానమని పోరాడే మేము వేర్పాటు వాదులమా? అంటూ విజయ్‌ సేతుపతి చెప్పే డైలాగ్‌ ఈ సినిమాకి హైలెట్‌గా నిలిచింది.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమా పార్ట్ టు గురించి ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి వంటి పెద్ద పెద్ద నటులు నటిస్తున్నారు. ఈ రిలీజ్ డేట్ పై అధికారులకు ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు