Dil Raju: బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Dil Raju: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దిల్ అనే సినిమా నుంచి ప్రొడ్యూసర్ గా కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు వరకు దాదాపు 50 సినిమాలు పైగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. దిల్ రాజు చేసిన సినిమాల్లో ఎక్కువగా సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక సినిమాను చాలా బాగా జడ్జ్ చేయగలుగుతారు అని దిల్ రాజుకి మంచి పేరు ఉంది. రీసెంట్ టైమ్స్ లో దిల్ రాజు జడ్జిమెంట్ కొంతమేరకు రాంగ్ అయింది. కానీ ఒకప్పుడు దిల్ రోజు బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద మంచి అంచనాలు పెరిగేవి. బ్యానర్ లో చివరగా వచ్చింది సినిమా ఫ్యామిలీ స్టార్.

Dil Raju

కమర్షియల్ గా హిట్ అయిన కలెక్షన్స్ రాలేదు

ఫ్యామిలీ స్టార్ సినిమా ఊహించిన రెస్పాన్స్ ను సాధించలేకపోయింది. దిల్ రాజు వరుసగా స్టార్ హీరోలతో సినిమా చేస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయలేకపోయాను అంటూ ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు. అయితే అది కూడా లేకుండా రియంట్రీ సినిమాను దిల్ రాజు నిర్మించారు. వకీల్ సాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా డిజైన్ చేశాడు ఆ సినిమాను వేణు శ్రీరామ్. సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించినా కూడా కలెక్షన్స్ మాత్రం రాలేదు. దీని కారణం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టిక్కెట్ రేట్లు.

- Advertisement -

Vakeel Saab

అసలు వివాదం ఏంటి

2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించినప్పటి నుంచి ప్రశ్నించడమే ధ్యేయంగా పెట్టుకొని చాలామందిని ప్రశ్నించటం మొదలుపెట్టారు. అనేక అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైసీపీ పార్టీకి టార్గెట్ గా మారారు. పవన్ వ్యక్తిగతంగా ఏం చేయలేం కాబట్టి పవన్ సినిమాలను ఆపితే కొంతమేరకు సెట్ అవుతుందని అనుకున్నారు. అని పవన్ కళ్యాణ్ మాత్రం వీటికి లొంగలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు మూడు రిలీజ్ అయిన కూడా అవి మంచి టాకును సాధించుకున్న కలెక్షన్స్ మాత్రం రాలేదు. అందులో దిల్ రాజు చేసిన వకీల్ సాబ్ సినిమా ఒకటి. కేవలం పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ కారణంగా ఈ సినిమా టిక్కెట్లను అమాంతం తగ్గించేశారు. దీంతో సినిమాకు రావలసిన ప్రాఫిట్స్ కొంతమేరకు తగ్గిపోయాయి.

ఇద్దరు రెండు భుజాలు

ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ పార్టీ అధికారంలోకి రావడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కీలక పాత్రను పోషించారు అనేది వాస్తవం. ఇప్పుడు చాలామంది కంటే కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అధికారంలో ఉన్నారు కాబట్టి తెలుగు సినీ పరిశ్రమకు కొంతమంది జరిగే అవకాశం ఉంది. టికెట్ రేట్ల విషయంలో కూడా ఇది పెద్ద హెల్ప్ అవుతుంది. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ వీరిద్దరూ ఒకరు కుడి భుజం ఒకరి ఎడం భుజం అంటూ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు