Katrina Kaif: రూమర్లకు చెక్ పెట్టిన కత్రినా కైఫ్..!

Katrina Kaif..మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ అందం కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవల కాలంలో ఈమె గురించి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కత్రినా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియా కోడై కోసిన విషయం తెలిసిందే. ఇక ఒక వీడియో ఆధారంగా ఆమె గర్భవతి అయిందంటూ వార్తలు వినిపించాయి. లండన్ కు చెందిన కత్రినా అక్కడే ఒక బిడ్డకు జన్మనిస్తుంది అని కూడా కొంతమంది కామెంట్లు చేశారు.. దీంతో కత్రినా ఈ వార్తలకు చెక్ పెట్టింది. ఫ్లాట్ పొట్టతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..

రూమర్లపై క్లారిటీ..

Katrina Kaif: Katrina Kaif put a check on the rumours..!
Katrina Kaif: Katrina Kaif put a check on the rumours..!

ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా కత్రినా కైఫ్ గర్భవతి అంటూ వార్తలు రాగా.. ఈమె తన భర్త విక్కీ కౌశల్ తో కలిసి గత నెలలో లండన్ కు విహారయాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే.. విక్కీ తన 36వ పుట్టినరోజును మే 16న లండన్ లో చాలా గ్రాండ్ గా జరుపుకున్నాడు.. ఇందుకు సంబంధించిన ఫోటోలను కత్రినా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఇక లండన్ పర్యటన ముగించుకున్న విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ జోడి శనివారం రాత్రి ముంబైకి చేరుకోగా.. అక్కడ ఎయిర్పోర్ట్లో కత్రినా బ్లాక్ సూట్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఆమె గర్భం దాల్చలేదు అనే విషయం మనం ఫోటోలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇక అలా ఆమె మారు మాట్లాడకుండా కేవలం ఫోటోషూట్ తోనే తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టిందని చెప్పవచ్చు.. మొత్తానికైతే ఈమె గర్భవతి అంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

విక్కీ కౌశల్ తో కత్రినా ప్రేమ పెళ్లి..

ఇకపోతే కొంతకాలం విక్కీ కౌశల్ తో ప్రేమాయణం కొనసాగించిన ఈమె.. 2021లో పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం కత్రినా తన కెరియర్ పైన దృష్టి పెట్టి వరుస సినిమాలలో నటిస్తోంది.. అందులో భాగంగానే టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మేరీ క్రిస్మస్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఇక ప్రస్తుతం ఇంకో ప్రాజెక్టును ఈమె ప్రకటించలేదు అని చెప్పవచ్చు.

- Advertisement -

విక్కీ కౌశల్ సినిమాలు..

విక్కీ కౌశల్ సినిమాల విషయానికి వస్తే.. మరొకవైపు ఛావా, బ్యాడ్ న్యూజ్, లవ్ అండ్ వార్ వంటి ప్రాజెక్టులలో విక్కీ కౌశల్ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఇలా ఇద్దరికీ ఎవరికి వారు వరుస సినిమాలను ప్రకటిస్తూ బిజీబిజీ షెడ్యూల్లో మరింత బిజీగా గడిపేస్తున్నారు ఇలాంటి సమయంలోనే వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఈ విషయాలు కాస్త వైరల్ గా మారాయి.. మొత్తానికైతే ఫోటోలతో క్లారిటీ ఇచ్చింది కానీ ఇక విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇప్పటికే వీరి వివాహం జరిగి మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికైనా శుభవార్త తెలపాలని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం. మరి ఎప్పుడు శుభవార్త చెబుతారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు