Kubera: మంత్ ఎండ్ కి ఫినిష్ , దీవాలి రిలీజ్.?

Kubera: త్రీ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. సినిమా రిలీజ్ కంటే ముందు దాంట్లో కొలవెరిడీ అనే పాట మంచి హిట్ అయింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు. ఆ తర్వాత ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ సినిమా తెలుగులో మంచి హిట్ అయింది అక్కడితో ధనుష్ కి ఫ్యాన్స్ కూడా మొదలయ్యారు. ఆ తర్వాత ధనుష్ చేసిన చాలా సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ధనుష్ చేసిన ప్రతి సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

Dhanush

రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు ధనుష్ సార్ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వెంకీ అట్లూరి కెరియర్ లో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ధనుష్ స్ట్రైట్ గా చేసిన తెలుగు సినిమా ఇది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ప్రస్తుతం చాలామంది తమిళ్ హీరోస్ తెలుగులో స్ట్రైట్ గా సినిమాలు చేస్తున్నారు. ధనుష్ తో పాటు శివకార్తికేయన్ కూడా తెలుగులో ప్రిన్స్ అనే సినిమాను చేశాడు. ప్రస్తుతం ధనుష్ చేస్తున్న సినిమా కుబేర.

- Advertisement -

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా పైన మంచి అంచనాలను పెంచుతుంది. రిలీజ్ చేసిన పోస్టర్ లో ధనుష్ బిచ్చగాడు గెటప్ లో కనిపిస్తున్నాడు. అదే ఒక బిచ్చగాడు ఎలా ధనవంతుడు అయ్యాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాలో ఒక కొత్త లుక్ లో ధనుష్ కనిపిస్తున్నాడు. ధనుష్ సరసన రష్మిక నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో పూర్తవుతుంది. ఈ సినిమా దివాలి కి రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు