Kalki 2898 AD Pre release event: ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఆయనే..?

Kalki 2898 AD Pre release event: అత్యంత బడా నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898AD.. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి..

ట్రైలర్ లాంచ్..

మరొకవైపు సినిమా తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై ప్రమోషన్స్ జోరుగా చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ ఉపయోగించిన వెహికల్ బుజ్జిని పరిచయం చేయడం కోసం భారీగా ఒక ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అంతే కాదు ఈ బుజ్జి పాత్రకి ప్రముఖ నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ తన వాయిస్ ను అందించారు. అలాగే భైరవ, బుజ్జి ల సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర సీఎం..

Kalki 2898 AD Pre release event: He is the chief guest of pre release event..?
Kalki 2898 AD Pre release event: He is the chief guest of pre release event..?

ఇకపోతే కల్కి కోసం చేసిన ఈవెంట్స్ ను తలదన్నేలా అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట నిర్మాత అశ్వినీ దత్.. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నట్లు సమాచారం.. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జూన్ 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఇక జూన్ 23 లేదా 25న జరిగే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన సీఎం హోదాలో చీఫ్ గెస్ట్ గా రానున్నట్లు సమాచారం. ఇక సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశాపటాని హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా అమితాబ్ బచ్చన్, కమలహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త తెరపైకి వచ్చింది.. ఇందులో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు క్యామియో పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం..

- Advertisement -

ముగ్గురు డైరెక్టర్లు క్యామియో రోల్..

ఇందులో సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లెజెండ్రీ డైరెక్టర్ రాజమౌళి , యంగ్ డైరెక్టర్ అనుదీప్ ముగ్గురు కూడా ఈ సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం. కేవలం కొన్ని నిమిషాల నిడివి ఉన్న పాత్రలలో.. వీరు అందులోనూ క్యామియో పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నారా చంద్రబాబునాయుడు కి ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ కి ముందు నుంచి మంచి అవినాభావ సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యం లో ముఖ్యమంత్రి తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే సినిమా మరింత హిట్ అవుతుందనే ఆలోచనలు నిర్మాత ప్లాన్ చేసినట్లు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు