HBD Balakrishna: బాలయ్య హీరోగా నటించక ముందు ఎన్ని సినిమాల్లో చేశారో తెలుసా..?

HBD Balakrishna.. నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటినా.. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో వరుస హ్యాట్రిక్ విజయాలు అందుకుంటూ స్టార్ హీరోలకి కూడా దీటుగా నిలుస్తూ మరొకవైపు రాజకీయంగా కూడా సొంతం చేసుకుని.. అటు ప్రజల మన్ననలు కూడా సొంతం చేసుకున్నారు.. నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందు తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఇక ఈరోజు ఈయన పుట్టినరోజు ఈ సందర్భంగా ఈయనకు సంబంధించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. 1960 జూన్ 10వ తేదీన నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు జన్మించిన బాలకృష్ణ.. బాల్యం మొత్తం హైదరాబాదులోనే పూర్తయింది..

తండ్రి దర్శకత్వంలో బాలయ్య ఎంట్రీ..

HBD Balakrishna: Do you know how many films Balayya acted in before acting as a hero?
HBD Balakrishna: Do you know how many films Balayya acted in before acting as a hero?

ఇక ఇంటర్మీడియట్ చదువు పూర్తవగానే నటుడు కావాలని కోరుకున్నాడు బాలయ్య.. కానీ కనీసం డిగ్రీ అయినా ఉండాలని తండ్రి చెప్పడంతో తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు బాలయ్య. ఇక ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ లోకి రావాలనుకున్న ఈయన 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల అనే చిత్రంతో 1974లోనే వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే ఈ సినిమా కంటే ముందే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపించాడు.. తర్వాత తండ్రి తో కలిసి నటించిన చిత్రాలు కూడా ఎక్కువగా ఉన్నాయి..

తండ్రితో కలిసి నటించిన చిత్రాలు..

ఇకపోతే బాలకృష్ణ హీరో గా మారకముందు.. తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి దానవీరశూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్రస్వామి పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఇండస్ట్రీలోకి హీరోగా రాకముందే ఈ చిత్రాలలో నటించారు బాలయ్య. 16 సంవత్సరాల వయసులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు.. ఇక 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారి హీరోగా నటించడం జరిగింది.

- Advertisement -

బాలయ్య కెరియర్ కు బాటలు వేసిన సినిమాలు..

ఇక బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలలో సాహసమే జీవితం , జననీ జన్మభూమి, మంగమ్మ గారి మనవడు , అపూర్వ సహోదరుడు, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య వంటి సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక తెలుగులో మొట్టమొదటిసారిగా తీసిన స్పై సినిమా ఆదిత్య 369.. ఇందులో బాలకృష్ణ పాత్రను , కథను చాలామంది మెచ్చుకున్నారు. ఇక 2019లో ఎన్టీ రామారావు బయోగ్రఫీ , ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు వంటి సినిమాలలో కూడా తన తండ్రి పాత్ర పోషించారు బాలయ్య.

యంగ్ హీరోలకి పోటీ..

ఇక ఇప్పుడు లెజెండ్, సింహ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలయ్య.. ఇక ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య వయసు 63 సంవత్సరాలు.. ఈ వయసులో కూడా ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇక త్వరలోనే ఈయన కొడుకు మోక్షజ్ఞ కూడా సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కథలు వింటున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తారో చూడాలి. ఏదేమైనా బాలకృష్ణ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు