Miral Movie Review : మిరల్ మూవీ రివ్యూ

Miral Movie Review : ప్రేమిస్తే మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటుడు భరత్. ఈ హీరో కొన్ని రోజుల క్రితమే మిరల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎం శక్తి దర్శకత్వంలో భరత్, వాణి భోజన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి కూడా డబ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహాలోస్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఓటిటి మూవీ లవర్స్ ని ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ ఏంటంటే?

హీరో హరి సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాడు. హరి, రమ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఈ దంపతులకు సాయి అనే కొడుకు ఉంటాడు. అయితే హరి విషయంలో ఆయన భార్య రమను కొన్ని పీడకలలు భయపెడుతూ ఉంటాయి. దీంతో రమ ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా, ఆమె సొంతూరికి వెళ్లి తమ ఆచారాల ప్రకారం కొన్ని పూజలు చేస్తే ఇవన్నీ ఆగిపోతాయని చెప్తుంది. తల్లి మాట మేరకు గ్రామంలోని కుల దైవం ఆలయంలో పూజలు చేసిన అనంతరం హరి ఫ్యామిలీ సిటీకి బయలుదేరుతారు. అయితే అప్పటి నుంచి పదేళ్ల క్రితం ఆ గ్రామంలో జరిగిన తరహాలోనే ఈ కుటుంబానికి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. ఒకానొక సమయంలో రమ కల నిజం అవుతుంది. వింత మనుషులు హరి ఫ్యామిలీని చంపడానికి ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలి అనుకుంటున్నారు? హరి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అక్కడ్నుంచి వీళ్ళు అసలు బయటపడ్డారా? అసలు వాళ్ళు ఎవరు? ఏఎ ఫ్యామిలీతో వాళ్ళకు సంబంధం ఏంటి ? అనే డౌట్స్ తీరాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే.

Miral review. Miral Tamil movie review, story, rating - IndiaGlitz.com

- Advertisement -

విశ్లేషణ

మూవీ ఎలా ఉందంటే మొదటి నుంచి హరి ఫ్యామిలీని ఓ అతీత శక్తి ఇబ్బంది పెడుతోంది అనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తూ ప్రతి క్షణం భయపెట్టడానికే అన్నట్టుగా పలు ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో గట్టిగానే ప్రయత్నించారు. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్ ట్రాన్స్ లో ఉండిపోతారు ప్రేక్షకులు. కానీ ప్రీ క్లైమాక్స్ దెబ్బ కొట్టింది. అక్కడే మూవీ ఫ్లాట్ తెలియడంతో నిరాశ పడాల్సి వస్తుంది. అయితే మొత్తానికి స్క్రీన్ ప్లేతో భయపెట్టే ప్రయత్నం చేశారు మేకర్స్. నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా తమ పరిధి మేరకు బాగానే చేశారు.

ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్

భరత్ నటన, సినిమాలోని సెకండ్ పార్ట్, సినిమాటోగ్రఫీ, హీరోయిన్ వాణి భోజన్ నటన ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ పార్ట్ లో కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టుగా అనిపించడం, ప్రీ క్లైమాక్స్, డబ్బింగ్ ప్రేక్షకులను చికాకు పెడతాయి అని చెప్పుకోవచ్చు.

చివరగా…

మైనస్ పాయింట్స్ గురించి పట్టించుకోకుండా ఏమాత్రం అంచనాలు లేకుండా హారర్ మూవీని చూడాలి అనుకునే వారు మిరల్ మూవీని ఓసారి చూడొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు