Indian Cinema : ఇండియన్ సినిమాపై హాలీవుడ్ స్టార్స్ ఇంట్రెస్ట్… కష్టం ఒకరిది, పేరు ఇంకొకరికి

Indian Cinema : సొమ్మొకరిది సోకొకరిది అనట్టుగా కష్టం ఒకరిది అయితే ఇండియన్ సినిమాలో ఆ పేరు మరొకరికి దక్కుతోంది. పాన్ ఇండియా సినిమా అంటూ ఇండియన్ సినిమాను ప్రపంచం దృష్టిలో పడేలా చేసింది తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి. ఆ తర్వాత ఎక్కడ చూసినా ఇండియన్ సినిమా పేరు మార్మోగుతోంది. అయితే ఇటీవల కాలంలో పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు ఇండియన్ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ వీళ్ళు టాలీవుడ్ కి బదులు బాలీవుడ్ ను హైలెట్ చేస్తుండడం బాధాకరం. ఇంతకీ అసలు ఏం జరిగింది? అంటే…

ఇండియన్ సినిమా పై హాలీవుడ్ స్టార్స్ కన్ను

హాలీవుడ్ లో స్టార్స్ గా పేరు తెచ్చుకున్న కొంతమంది పాపులర్ సెలబ్రిటీలు ఇండియన్ సినిమాలో తాము కూడా ప్రత్యేకతను చాటుకోవాలని ఉవ్విల్లూరుతున్నారు. అయితే వాళ్లు తెలిసి చెబుతున్నారో తెలీక చెబుతున్నారు టాలీవుడ్ కి బదులు బాలీవుడ్ పేరును హైలెట్ చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా కి చెందిన డైరెక్టర్ ఫిలిప్ నోయ్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను చూసానని, అది ప్రపంచంలోనే సక్సెస్ ఫుల్ మూవీ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తూనే తనకు దేవ్ పటేల్ నటించిన మంకీ మ్యాన్ మూవీ అంటే కూడా ఇష్టమని పేర్కొన్నారు. అయితే తన ఫేవరెట్ మూవీ ఫతేలి పాంచాలి అని చెప్పుకొచ్చిన ఆయన తాను కూడా ఇండియాలో సినిమాలు తీయాలనే కోరికను బయటపెట్టారు.

Director Phillip Noyce wants to work with Shah Rukh Khan

- Advertisement -

అయితే బాలీవుడ్ వాళ్ళంటే తనకు చాలా ఇష్టమని, అందులోనూ షారుక్ ఖాన్ తో కలిసి సినిమా చేయాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చారు. ఫిలిప్స్ దర్శకత్వంలో తెరకెక్కిన సాల్ట్, ఫాస్ట్ చార్లీ అనే హాలీవుడ్ సినిమాలు భారీ హిట్ అయ్యాయి. అందులో 2023లో రిలీజ్ అయిన ఫాస్ట్ చార్లీ మూవీ ప్రస్తుతం ఇండియాలో రిలీజ్ అయిన సందర్భంగా చార్లీ ఈ కామెంట్స్ చేశారు. మరో పాపులర్ బ్యాండ్ అయినా చైన్ స్మోకర్స్ లో ఒకరైన అలెక్స్ పాల్ రామ్ చరణ్ ని హాట్ డ్యూడ్ అంటూ ఆయనతో కలిసి పని చేయాలని ఉందని చెప్పి మెగా అభిమానుల్లో జోష్ పెంచారు. అయితే ఆయన బాలీవుడ్ పై ప్రేమను కురిపించాడు. ప్రియాంక చోప్రా తో కలిసి నటించాలని ఉందని గతంలో కామెంట్స్ చేసిన ఆయన తాజాగా షారుక్ ఖాన్ ని కలవాలని ఉందంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇండియన్ సినిమా అంటే బాలీవుడా ?

ఇలా చాలామంది ఇండియన్ సినిమా అనగానే బాలీవుడ్ అనుకుంటున్నారు. నిజమే అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్లో సరైన కథతో హిట్టు కొట్టడానికే స్టార్ హీరోలు కూడా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలో టాలీవుడ్ దే పై చేయి. బాలీవుడ్ స్టార్స్ హాలీవుడ్ సినిమాలలో నటించి ఉండవచ్చు. కానీ భారతీయ సినిమా కీర్తి కిరీటాన్ని ప్రపంచ సినిమా వరల్డ్ లో ఎగరేసింది మాత్రం రాజమౌళినే. అలాంటిది ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే హాలీవుడ్ ప్రముఖులు ఇంకా బాలీవుడ్ వైపు చూడడం బాధాకరం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు