Pushpa 2 : దిమ్మతిరిగేలా పుష్ప 2 నైజాం రైట్స్..?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో తన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటించిన విషయం తెలిసిందే. పుష్ప సినిమా అనంతరం ప్రతి ఒక్కరూ పుష్ప-2 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా నుంచి “పుష్ప పుష్ప” సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలో స్టెప్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. “సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి” అంటూ సాగే ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు ఈ పాట మీద రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో సుకుమార్ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట.

Brahmaji: Brahmaji in Pushpa 2.. a strong counter to trollers..!

- Advertisement -

ఈ సినిమాలో యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి నటిస్తున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా….పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక పుష్ప టు సినిమా రైట్స్ కొనడం కోసం దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్స్ తొందరపడుతున్నారు. పుష్ప టు నైజాం రైట్స్ బడా డిస్ట్రిబ్యూటర్ రూ. 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీని గురించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు