Kalki2898AD Trailer : గెట్ రెడీ ప్రభాస్ ఫ్యాన్స్..!

Kalki2898AD Trailer : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఆ సినిమా అనంతరం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం “కల్కి 2989 AD”. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మహానటి వంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే “కల్కి 2989 AD” సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. టైం ట్రావెలర్ టీం తో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

- Advertisement -

Kalki 2898 AD Hindi Trailer Release Time Announced - OneArabia

ఈ సినిమా ట్రైలర్ ను దేశవ్యాప్తంగా పలు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ లిస్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రాత్రి 7 గంటలకు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఈ సినిమా ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీపికా పదుకొనే ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి. “కల్కి 2989 AD” సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు