Natural star Nani: నాని ” సరిపోదా శనివారం ” ఫస్ట్ సింగిల్ అప్డేట్ అప్పుడే..!

Natural star Nani: టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని తాజాగా నటించిన మూవీ సరిపోదా శనివారం. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్నారు.

ఇక ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ అంచనాలను రెట్టింపు చేశారు మేకర్స్. ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ సంబంధించి నేడు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ చిత్రానికి జేక్స్ బీజోయ్ సంగీతం అందించడంతో ఈ మూవీలోని పాటలు ఎలా ఉంటాయా అని అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు