Anchor sravanthi: ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పేరు స్రవంతి. ఒకానొక సమయంలో స్రవంతి అంటే పెద్దగా ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. యాంకరింగ్ రంగంలో తనదైన ఉషారు చూపిస్తూ దూసుకుపోతోంది.
ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనగానే సుమ మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు స్రవంతి గుర్తుకొస్తుంది డైరెక్టర్స్ కి. ఆ విధంగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస ప్రీ రిలీజ్ ఈవెంట్లను చేస్తూ తనదైన సత్తా చాటుతుంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్స్ ని తలదన్నే అందంతో మిస్మరైజ్ చేస్తుంది. ఇక గతంలో విశ్వక్సేన్ ఈమె హీరోయిన్స్ ని మించిన కాస్ట్యూమ్స్ ధరిస్తుంది..అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. ఇక అప్పుడు విశ్వక్సేన్ మాటలని పెద్దగా ఎవరు పట్టించుకోకపోయినా ప్రెసెంట్ ఈ హీరో వ్యాఖ్యలే నిజమవుతున్నాయి.