Ram Charan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. బుధవారం అనగా జూన్ 12న ఘనంగా విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఐటీ టవర్స్ సమీపంలోని 11 ఎకరాల స్థలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఇప్పటికే ముఖ్యమైన వారికి ఆహ్వానాలు సైతం అందించారు. సినీ, రాజకీయ అండ్ ఇతర రంగాలకి చెందిన ప్రముఖులకు ఇన్విటేషన్ పంపించారు. ఇక టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు అవుతున్నట్లు తెలుస్తుంది. ఆహ్వానం అందిన వెంటనే వెళ్లాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక ఈ ప్రమాణ స్వీకారానికి చిరంజీవి కూడా విచ్చేయనున్నారు. ఇందుకు మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు చంద్రబాబు. ఇక ప్రస్తుతం చరణ్ పేరు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పాలిటిక్స్ లో పెద్దగా ఉషారు చూపించని చెర్రీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నాడు అనగానే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.