Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య వివాహం జూన్ 10న ఘనంగా జరిగింది. చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయ స్వామి మందిరంలో ఈ వివాహ వేడుక నిర్వహించారు. ఇక ప్రముఖ తమిళ్ హాస్య నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి తో ఐశ్వర్య వివాహం కనుల పండగలాగా జరిగింది.
జూన్ 7వ తారీఖున హల్ది కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ వివాహ వేడుకలో జూన్ 8న సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ఇక జూన్ 10న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అండ్ సిని ప్రముఖుల సమక్షంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అతిధులు నూతన దంపతులను ఆశీర్వదించారు.
ప్రెసెంట్ వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ ను చూసిన వారంతా కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు కూడా. ఇక మరికొందరు అయితే మీరైనా కలకాలం కలిసి ఉంటారా? లేదా అందరిలాగానే మూన్నాళ్ళ ముచ్చటి లాగానే విడిపోతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.