Mahesh Babu: నాన్నగారు నటించిన ఆ సినిమా వందసార్లు పైగా చూసా

Mahesh Babu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేసి తన తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి లెగిసిని కంటిన్యూ చేస్తున్నారు. ఏ పాత్రలోనైనా చాలా ఈజీగా ఇమిడిపోతాడు మహేష్ బాబు. చూడ్డానికి చాక్లెట్ బాయ్ లా క్యూట్ గా ఉన్నా కూడా, తనలోని మాస్ యాంగిల్స్ తో ఆడియన్స్ కి మంచి కిక్ ఇస్తాడు. ఇకపోతే చాలా చిన్నప్పటినుంచి మహేష్ బాబుకి సినిమాలు పైన ఆసక్తి ఉంది. ఇప్పటికీ కూడా రిలీజ్ అయిన ప్రతి సినిమాని చూసి ట్విట్టర్ వేదికగా అప్రిషియేట్ చేస్తుంటాడు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు బావ అయినటువంటి సుధీర్ బాబు హరోం హర అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా గన్స్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఇకపోతే ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక చిట్ చాట్ జరిపారు సుధీర్ బాబు. ఈ చిట్ చాట్ లో చాలా ఆసక్తికరమైన అంశాలను మాట్లాడారు. అయితే సుధీర్ బాబు కొన్ని ప్రశ్నలను మహేష్ బాబును అడిగారు. ఈ సినిమా గన్స్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కాబట్టి. ఫస్ట్ గన్స్ ట్రైనింగ్ ఏ సినిమాకు తీసుకున్నారు అని మహేష్ బాబుని అడిగాడు సుధీర్ బాబు.

Mosagallaku Mosagadu

- Advertisement -

దీనికి సమాధానంగా టక్కరి దొంగ అనే సినిమాకి ఫస్ట్ గన్స్ ని ట్రైనింగ్ తీసుకున్న అంటూ చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన పోకిరి సినిమాలో చాలా స్టైలిష్ గా గన్ తిప్పుతాడు మహేష్ బాబు. దానికి విలన్ అనే డైలాగ్ గన్ను బాగా తెలిసినట్టు చెప్పావు. అనగానే సినిమాలు చూడట్లేదు ఏంటి అంటాడు మహేష్. అలా చెప్పినట్లు తాను టక్కరి దొంగ సినిమా కోసం గన్స్ ట్రైనింగ్ చేసిన కూడా, తన తండ్రి చేసిన ఒక సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను అని చెబుతూ ఉంటాడు. ఆ సినిమా పేరు మోసగాళ్లకు మోసగాడు. ఆ సినిమాలో గన్స్ కృష్ణ గారు బాగా వాడుతారని, ఆ సినిమా నాకు ఎప్పటికీ బాగా ఇష్టమని. ఆ సినిమాను దాదాపుగా వందసార్లు పైగా చూసి ఉన్నానని చెప్పాడు మహేష్ బాబు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు