Film Industry: ఆ ప్రభుత్వం సినిమా వాళ్ళను పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం సినిమా వాళ్లకి ప్రత్యేక ఆహ్వానం పలుకుతుంది

Film Industry: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ఒకప్పుడు మంచి సంబంధం ఉండేది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అమరావతిని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుందని, దర్శకుడు రాజమౌళితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరిపారు. ఆ తర్వాత అప్పుడు హుదూద్ తుఫాను వస్తే చాలామంది సినిమా వాళ్లు ఈవెంట్స్ చేసి విరాళాలు అర్పించారు. అయితే చంద్రబాబు నాయుడు ఐదేళ్లు పాలన చేసిన తర్వాత, వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ టార్గెట్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకి మధ్య సంబంధం బాగా తగ్గుతూ వచ్చింది. 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా నిలబడి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలకపాత్రను వహించారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే చాలు కొత్త జీవోని విడుదల చేసి సినిమా టిక్కెట్ రేట్లను తగ్గించేది. ఇవి మాత్రమే కాకుండా చాలామంది సినిమా ప్రముఖులను జగన్మోహన్ రెడ్డి తన వద్దకు రప్పించుకున్నారు. చాలామంది సినిమా వాళ్లకి నచ్చని విషయం.

Pawan Kalyan

- Advertisement -

సినిమా వాళ్లకు ప్రాముఖ్యత

ఇకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎంగా చేయనున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి సినిమా వాళ్లను ఆహ్వానించారు. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి నటులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూడా మంచి స్థాయిలో ఉండడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పొచ్చు. ఇకపోతే గత ప్రభుత్వం సినిమా వాళ్లకు ప్రాముఖ్యతను ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం మాత్రం సినిమా వరకు బ్రహ్మరథం పడుతుందని చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు