Tollywood: పెద్దింటి కోడళ్ళకి ఆ దుస్థితి తప్పదా..?

Tollywood.. ప్రస్తుతం ఇటీవల కాలంలో ఈ వార్త బాగా వైరల్ గా మారిందనే చెప్పాలి.. ఒకప్పుడు పెద్దింటి కోడళ్ళుగా మారకముందు చాలా మంది స్టార్ హీరోయిన్లుగా సినీ పరిశ్రమని రాజ్యమేలగా పెళ్లి తర్వాత మాత్రం చాలా సైలెంట్ గా మారిపోతున్నారు.. దీనికి కారణం ఏమిటో అని ఇప్పుడు జనాలు కూడా చర్చించుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీని తమ అందచందాలతో ఏలేసిన ఈ అందమైన హీరోయిన్స్ ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.. అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు.. కానీ ఎక్కడ ఫుల్ స్వింగ్లో ఫుల్ సాటిస్ఫైడ్ గా కనిపిస్తున్న దాఖలాలైతే కనిపించడం లేదు.

పెద్దింటి కోడళ్ళకు అటువంటి దుస్థితి..

Tollywood: Isn't that the plight of elder daughters-in-law?
Tollywood: Isn’t that the plight of elder daughters-in-law?

ముఖ్యంగా ఇలాంటి ప్రశ్నకు మొదటగా వినిపించే పేరు సమంత.. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ఆమె ఫ్రీడం కోల్పోయింది.. పెళ్లి తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా పెట్టడం వల్లే ఆమె విడాకులు తీసుకుందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మెగా కోడలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తన అంద చందాలతో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ అందరిని అలరించిన లావణ్య త్రిపాఠి నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక లావణ్య ఇప్పుడు మెగా ఇంటికి కోడలు అయిపోయింది.. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో చాలా జోరుగా కనిపించిన లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయిందనే చెప్పాలి.. సోషల్ మీడియాలో కూడా పోస్ట్లు చాలా అరుదుగా మాత్రమే పెడుతుంది. సినిమాలకు కూడా ఎక్కువగా కమిట్ అయినట్టు కనిపించడం లేదు. దీంతో పెద్దింటి హీరోలను పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దింటికి కోడలు అయిన ప్రతి హీరోయిన్ దుస్థితి ఇలాగే మారుతుందా అనే కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి.

సమంత అందుకు ఉదాహరణ..

ముఖ్యంగా పెద్దింటికి కోడలు అయిన తర్వాత ఆ పెద్దింటి వాళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను వీళ్ళు భరించలేక విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సినీ ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీల ఇంటికి కోడలుగా వెళ్లడం అంత మంచిది కాదు అని.. వీరు తమ జీవితాల ద్వారా ఉదాహరణగా చెప్పుకొస్తున్నారని చెప్పాలి.. ఎలాగో సమంత విడాకులు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరి లావణ్య త్రిపాఠి సంగతి ఏంటో చూడాలి.

- Advertisement -

విడాకుల తర్వాత సమంత కెరియర్..

ఇక ప్రస్తుతం సమంత విషయానికి వస్తే.. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే గత ఏడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడిన నేపథ్యంలో.. వ్యాధి నుంచి కోలుకోవడానికి ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈమె కొత్త నిర్మాణ సంస్థను కూడా స్థాపించి.. అటు హీరోయిన్గా ఇటు నిర్మాతగా మారి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తుంది.

లావణ్య పరిస్థితి కూడా అలాగేనా..

ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. గతంలో ఏటించిన ప్రాజెక్ట్ జెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇది సినిమా కూడా ఓటీడీలో బాగా ఆకట్టుకుందని చెప్పాలి ఇక ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు