Lucky Bhacker: జీవి ప్రకాష్ కుమార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు జీవీ ప్రకాష్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి జీవి ప్రకాష్ మేనల్లుడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే జీవి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. తెలుగులో కూడా జీవి ప్రకాష్ చేసిన ఎన్నో ఆల్బమ్స్ ఘన విజయాన్ని సాధించాయి.
ముందుగా ఏఆర్ రెహమాన్ దగ్గర కొన్ని సినిమాలకు పనిచేసిన జీవి ప్రకాష్ కుమార్, ఆ తర్వాత హరీష్ జయరాజ్ దగ్గర కొన్ని సినిమాలుకు వర్క్ చేశాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాలో రెండు పాటలను కూడా పాడాడు. జీవి ప్రకాష్ కుమార్ తమిళ్లో చేసిన మద్రాస్ పట్నం సాంగ్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయక్కం ఎన్న సినిమా జీవి ప్రకాష్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది.
ప్రస్తుతం తెలుగులో చాలా పెద్ద ప్రాజెక్టుకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు జీవీ ప్రకాష్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ తో చేస్తున్న లక్కీ భాస్కర్ సినిమాకి కూడా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అలానే విక్రమ్ నటిస్తున్న తంగలన్ సినిమా కూడా సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ట్విట్టర్ వేదిక ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ను అందించాడు.
#LuckyBhaskar and #thangalaan first singles completed and handed over to the producers …. Both singles soon 🔥 … c u all soon . 🫡
— G.V.Prakash Kumar (@gvprakash) June 11, 2024